Connect with us

Entertainment

Bigg Boss 8 Telugu Day 31: యష్మీ అసలు రూపాన్ని బయటపెట్టిన పృథ్వీ..

పోయిన సీజన్లలో బిగ్ బాస్ మార్నింగ్ సాంగ్ వేస్తే.. అంతా నిద్రలో నుంచి లేచి వచ్చి డాన్స్‌లు చేసేవాళ్లు. కానీ ఈ సీజన్‌లో బిగ్ బాస్ సాంగ్ వేస్తే మేం లేవాలా ఏంటీ అన్నట్టుగా.. దున్నపోతుల మాదిరిగా నిద్ర లేవడం లేదు. ఈరోజు కూడా.. విజిలు.. విజిలు.. అంటూ సాంగ్ వేశారు కానీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా డాన్స్ వేయలేదు. నబీల్, సీతలు మాత్రమే లేచి గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. మిగిలిన వాళ్లంతా నిద్రలో నుంచి లేవకపోవడంతో కుక్క అరుపులు వినిపించాయి. వీడికి పనేం లేదా? అన్నట్టుగా అలా చూస్తూ ఉన్నార యష్మీ, విష్ణు, ప్రేరణ, నైనికలు. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయ్ అన్నట్టుగా సైగ చేసింది విష్ణు ప్రియ.

ఇక వీళ్లు ఎలాగూ నిద్ర లేవడం లేదనుకున్న బిగ్ బాస్ వాళ్లతో ఓ టాస్క్ ఆడించాడు. దాంతో.. నాగ మణికంఠ సూపర్ మచ్చి అనే ఐటమ్ సాంగ్‌కి చిందులు వేశాడు. మధ్యలో నైనిక జాయిన్ అయ్యి.. ఓ ఊపు ఊపేసింది. అబ్బో మణికంఠలో ఈ టాలెంట్ కూడా ఉందా అన్నట్టుగా తనకి వచ్చినట్టే చేసి హౌస్ మేట్స్‌ని మెప్పించాడు. ఆ తరువాత నబీల్ టాస్క్ లో ఓడిపోవడం తో అతనికి కి స్పూన్‌తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చాడు. ఆ తరువాత ఎప్పుడూ మణికంఠపై కోపం చూపించే యష్మీని.. అతనితో కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్.. దాంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఆ తరువాత పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. విష్ణు అయితే ఆ గెటప్ చూసి తెగ సిగ్గుపడిపోయింది. అయితే ఈ టాస్క్‌లో కాంతారా టీం గెలవడంతో.. వాళ్లకి చాక్లెట్స్ పంపించాడు మన బిగ్ బాస్.

ఆ తరువాత సర్వేవల్ టాస్క్ ముగిసినట్టు ప్రకటించారు బిగ్ బాస్. అయితే కాంతారా టీం ఎక్కువ టాస్క్‌లు గెలిచిన కారణం వాళ్లకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ల క్లాన్ నుంచి నేరుగా చీఫ్ అవకాశాన్ని ఇచ్చారు. చర్చించుకుని మీలో ఎవరు చీఫ్‌‌ కంటెండర్ అవుతారో చెప్పాలని అన్నారు బిగ్ బాస్. దాంతో.. యష్మీ గౌడ.. నా అంత తోపు లేదు.. ఇరగదీశా.. మళ్లీ చీఫ్ అయ్యి ఇరగదీస్తా.. నాకు చాలా నాలెడ్జ్ ఉంది.. పృథ్వీకి లేదు అన్నట్టుగా చెప్పింది. దాంతో పృథ్వీ.. నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు అని గట్టిగా వాదించి చెప్పాడు.

దాంతో యష్మీ రెచ్చిపోవడం స్టార్ట్ చేయడంతో.. ‘నువ్వు వాయస్ పెంచకు.. ఒకసారి నువ్వు చీఫ్ అయ్యావ్.. అయితే నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావ్.. మళ్లీ చీఫ్ అవుతానని ఎలా చెప్తున్నావ్.. నువ్వు నా మిస్టేక్స్ చెప్తే.. నేను నీ మిస్టేక్స్ చెప్తా’ అని పృథ్వీ అన్నాడు. దాంతో అవునా చెప్పు.. నా మిస్టేక్స్ ఏంటో చెప్పు అని అన్నప్పుడు.. యష్మీ బాగోతాన్ని మొత్తం బయటపెట్టాడు పృథ్వీ.

మణికంఠని మగాడు కాదని అన్నావ్ కదా.. అనలేదని అబద్దం చెప్పావ్’ అని అసలు నిజాన్ని అప్పుడు బయటపెట్టాడు పృథ్వీ. అప్పుడు కూడా.. నేను అసలు అలా అనలేదు అని చెప్పింది యష్మీ. ‘అవునా.. అయితే నువ్వు ఎం అననప్పుడు ఎందుకు సారీ చెప్పావ్ అని పృథ్వీ అడిగాడు. దీనికి యష్మీ.. ‘వద్దూ ఆ పాయింట్ తీయకు.. ఆ టాపిక్ ఎత్తకు.. మమ్మీపై ఒట్టేశాను కదా’ అని మమ్మీ పై ఒట్టేసి కూడా అబద్దం ఆడింది యష్మీ.

అసలు నువ్వు ఒట్లు పెట్టకు.. నువ్వు ఆరోజు నిజంగా అన్నావ్.. ఇప్పుడు అనలేదని అంటున్నావ్. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు. దాన్ని మళ్లీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. అంతకముందు నీకు నువ్వే చీఫ్‌గా ఫెయిల్ అయ్యానని రెడ్ ఇచ్చుకున్నావ్.. నీకు తెలుసు.. నువ్వు బ్యాడ్ ప్లేయర్ అని.. అంతేకాదు స్పెల్లింగ్ గేమ్‌లో కూడా ఓడిపోయావ్.. ఇవన్నీ నీ మిస్టేక్సే’ అని యష్మీ బాగోతాలన్నీ వరుసగా పృథ్వీ బయటపెట్టాడు . అయితే యష్మీ నాగార్జున గారి ముందు.. మణికంఠని మగాడు కాదని అనలేదంటూ తన తల్లిపై ఒట్టేసేసింది. కానీ ఆమె కావాలనే అన్నదనే విషయం అక్కడ ఉన్న పృథ్వీతో పాటు.. నిఖిల్ కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టాడు పృథ్వీ.

Loading