Connect with us

Entertainment

పవన్ కళ్యాణ్ OG షూట్ అప్డేట్.. త్వరగానే అయిపోద్దా?

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి సంబంధించిన షూట్ ఈ మధ్యే మళ్లీ స్టార్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రి పూట షూటింగ్ జరుగుతోందట. ఇక ఈ మూవీ షూటింగ్‌కి ఇంకో రెండ్రోజుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ అవుతారట. ఇక ఈ షెడ్యూల్‌తో దాదాపు ఓజీ షూట్ మొత్తం పూర్తి కానుందని సమాచారం. అసలే ఈ ఒక్క షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అంతా ఇన్నిరోజులు ఎదురుచూసిన సంగతి తెలిసిందే. అసలు ఈ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఇక్కడే సెట్స్ వేసి షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమా షెడ్యూల్స్‌ని ముందుకు కదిలించాడు. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉండి.. సినిమా షూటింగ్‌లను పట్టించుకోలేదు. ఇక తన నిర్మాతల విన్నపం మేరకు కొన్ని డేట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. వాటిల్లోనే షూటింగ్ చేసుకోవాలని అన్నాడు. దాంతో పవన్ కళ్యాణ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక్కడే సెట్స్ వేశారు. షెడ్యూల్స్ అన్నీ మార్చారు. అవుట్ డోర్ షూటింగ్‌లను క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

తాజాగా నిధి అగర్వాల్ చేసిన ట్వీట్‌తో ఓ విషయం అర్థం అవుతుంది. ఆంధ్రలో హరి హర వీరమల్లు షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌తో నిధి అగర్వాల్ కి ఉన్న సీన్లను షూట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకే రోజు రెండు చిత్రాలకు షూటింగ్.. అది కూడా రెండు రాష్ట్రాల్లో.. ఇద్దరు పెద్ద హీరోలతో.. రెండు పాన్ ఇండియన్ సినిమాలకు షూటింగ్ చేయడం ఆనందంగా ఉందంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు కోసం పని చేస్తున్నాడు.

మరో వైపు ఓజీ యూనిట్ కూడా కొత్త షెడ్యూల్‌ను రెడీ చేసుకుంటుంది. ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేశారట. ఇతర ఆర్టిస్టులతో రాత్రి పూట షూటింగ్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ రెండు, మూడు రోజుల్లో వస్తాడట. ఈ షెడ్యూల్‌తో ఓజీ షూట్ పూర్తి కానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎలాగైనా సరే హరి హర వీరమల్లు, ఓజీలను దించాలని మేకర్లు గట్టిగా ఫిక్స్ అయ్యారు.

ఇవిలా ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ ఊసే లేకుండా పోయింది. హరిష్ శంకర్ మిస్టర్ బచ్చన్ బోల్తా కొట్టడంతో డీలా పడ్డాడు. మరి ఈ ఉస్తాద్ భగత్ సింగ్‌ను తెరకెక్కిస్తారా? పక్కన పెట్టేస్తారా? అన్నది తెలియడం లేదు. ఈ మూవీ అయితే ఉంటుందని మేకర్లు చెబుతున్నారు. కానీ ఈ చిత్రంపై ఆడియెన్స్‌కి అభిమానులకి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు.

Loading