Entertainment
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఎంట్రీ… మొత్తానికి సిద్దం అవుతున్నాడా?

మెగా కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో రావాలని, రాబోతోన్నాడని అంతా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో వైపు అకిరా నందన్ కూడా తన ఎంట్రీకి సిద్దం అవుతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఓజీ లో స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడని గాసిప్స్ వస్తున్నాయి. అదిరిపోయేలా ఫైట్స్ చేస్తున్నాడంటూ కొన్ని వీడియోల్ని సైతం అభిమానులు తెగ వైరల్ చేశారు. అయితే అకిరా ఎంట్రీ ఉండటం అయితే కన్ఫామ్. కానీ అది ఓజీ మూవీనా? ఇంకో సినిమానా? అన్నది ఎవ్వరికీ తెలియడం లేదు.
అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వరుణ్ తేజ్, శిరీష్ లు ఎంట్రీలు ఇచ్చారు. నాగబాబు మొదట్లో హీరోగా, నటుడుగా, నిర్మాతగా ఇలా అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా ఎదిగి రాజకీయాల్లో రాణిస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు టాప్ స్టార్లులు దుమ్ములేపుతున్నారు. మెగా ప్యామిలీ ఇమేజ్‌తో ఇండస్ట్రీలో ఈజీగానే ఛాన్స్ దక్కించుకున్న సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా కొందరు సొంత బ్రాండ్ ను క్రియేట్ చేయడంలో విఫలం అవుతూ ఉన్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అకిరా కూడా రాబోతోన్నాడని, అందుకు ముహూర్తం సిద్దమైందని తెలుస్తోంది.
అలానే రేణూ దేశాయ్ అయితే అకీరా ఎంట్రీ గురించి చాల సార్లు స్పందించింది. అకీరాకు మ్యూజిక్, స్పోర్ట్స్, స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అయితే సినిమాల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు.. కానీ అకీరా ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం.. తానే అందరి కంటే ముందు ప్రకటిస్తానని చెప్పారు. అప్పట్లో అకీరా న్యూయార్క్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లోనూ అకిరా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా సత్యానంద్ వద్దే యాక్టింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. మరి అకీరా.. సత్యానంద్ వద్ద ట్రైనింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే స్క్రీన్ మీదకు వస్తాడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.