Entertainment

OTTలో ‘జాట్’ హవా

Sunny Deol's Jaat Ott Streaming Platform Locked: Here's Where You Can Watch  It Online - IMDb

సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తీసిన యాక్షన్ సినిమా ‘జాట్’ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం భారత్‌లో నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా దాదాపు రూ.120 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రెజీనా కీలక పాత్రలో నటించగా, తమన్ అద్భుతమైన సంగీతంతో సినిమాకు మరింత బలం చేకూర్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. సన్నీ డియోల్ శక్తివంతమైన నటన, గోపీచంద్ యాక్షన్ సన్నివేశాల తీరు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ‘జాట్’ సినిమా ఓటీటీలో కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version