Entertainment

నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్… లక్కీ లేడీ మళ్లీ స్క్రీన్ పైకి!

అక్కినేని నాగార్జున తన 100వ సినిమాతో మైలురాయి అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు తమిళ దర్శకుడు రా కార్తీక్ మెగాఫోన్ పట్టనున్నాడు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమాలో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ టబు ఓ కీలక పాత్రలో నటించబోతోందట.

టబు–నాగార్జున కాంబినేషన్ అంటే టాలీవుడ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి హిట్ చిత్రాల్లో నటించగా, ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ సినిమాతో 27 ఏళ్ల తర్వాత టబు–నాగ్ మళ్లీ రీయూనైట్ అవుతున్నారు.

ఈ మూవీలో నాగార్జున కుమారులు నాగ చైతన్య మరియు అఖిల్ కూడా కేమియో రోల్స్ చేయబోతున్నట్టు టాక్. సినిమాకి ‘కింగ్ 100‘ లేదా ‘లాటరీ కింగ్‘ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

‘కూలీ’ తర్వాత గ్యాప్ తీసుకున్న నాగార్జున, ఈ సినిమా ద్వారా ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్‌లో మళ్లీ కనిపించనున్నాడు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, 2026 మేలో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version