Telangana
ప్రియురాలితో DEO రాసలీలలు.. భార్య చేతికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వైనం..

జిల్లాలోని పాఠశాలలు, విద్యావ్యవస్థను గాడినపెట్టాల్సిన డీఈవో (విద్యాధికారి) గాడి తప్పారు. ఆయన భార్య ఉండగానే మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య, ఆ మహిళతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా డీఈవో వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య, భర్త వ్యవహారంపై నిఘా పెట్టింది. గురువారం (నవంబర్ 21) రోజున, డీఈవో ఆ మహిళతో ఉన్న సమయంలో భార్య మరికొందరితో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ వ్యవహారం కాస్త బట్టబయలైంది. అయితే, భార్య ఇంట్లో ఉన్న మహిళను నిలదీశారు. ఆమె సమాధానం ఇవ్వక, “నువ్వు ఇక్కడ రా.. బయటికి వెళ్లిపో” అంటూ బెదిరించారు. అంతేకాదు, ఆమె లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. ఈ క్రమంలో, ఆమెతో వచ్చినవారు ఈ వీడియోను తీసి, ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డీఈవో భార్య మాట్లాడుతూ, “తనను పెళ్లి చేసుకుని వదిలేసి 14 సంవత్సరాలు కోర్టులో విడాకుల కేసును నడిపిస్తున్నాడు. తనకు విడాకులు ఇంకా మంజూరు కాకముందే, మరో మహిళతో వివాహం చేసుకున్నాడు. మధ్యలో మరొక మహిళతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓ మహిళను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, తనకు తెలియకుండా ప్రియురాలితో ముగ్గురు పిల్లలను కూడా పుట్టించాడని ఆమె ఆరోపించారు. తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఈ మేరకు డీఈవో భార్య నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. స్థానికులు, మహిళా సంఘాలు డీఈవో వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహిళా ఉపాధ్యాయులపై లైంగిక వేదింపులకు పాల్పడిన డీఈవోపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, డీఈవోపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. నల్గొండలో రాజకీయ బలం ఆధారంగా ఉన్న డీఈవోపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.