Telangana

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం తెలంగాణలో కొత్త చట్టం.. ఈ నెలలోనే అమల్లోకి..

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం తెలంగాణలో కొత్త చట్టం.. ఈ నెలలోనే అమల్లోకి..

తెలంగాణ త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రానున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పస్తుతం ఉన్న ధరణి పోర్టల్‌ను రద్దు చేయనున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించాడు .. ఈ నెలాఖరులోగా కొత్త ఆర్వోఆర్ ROR చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు అక్టోబర్ 07వ తేదీతో ప్రజాప్రభుత్వానికి 10 నెలలు పూర్తి కానున్నట్టు గుర్తుచేసిన మంత్రి.. ప్రజలు కోరుకున్న ప్రగతిని సాధించలేకపోయామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న క్రమం లో  మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ముందు నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ఆర్వోఆర్ (ROR) చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు పొంగులేటి ప్రకటించారు. ఈ కొత్త చట్టాన్ని అక్టోబర్ నెలాఖరులోగా అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

త్వరలోనే తెలంగాణలో అమల్లోకి తీసుకురానున్న  కొత్త ఆర్వోఆర్ చట్టం.. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యలో కూర్చొని ధరణి పోర్టల్‌ను సిద్ధం చేసినట్టుగా కాకుండా.. ఈ కొత్త చట్టం రూపకల్పన విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ లో ధరణి పోర్టల్ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికే చాలా భూమీ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వేలాడించారు . కొత్త చట్టం అమలులోకి తీసుకొచ్చి ప్రజల భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని  అందరి ముందు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను గాలికి వదిలేసిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి  పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను దసరాలోపు ఇల్లు లేని పేద ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల పార్టీలు ఇచ్చే  సలహాలు, సూచనలు కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలను స్మార్ట్ ఫ్యామిలీ  డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఆ స్మార్ట్ ఫ్యామిలీ  కార్డులు కూడా ఈ దసరాలోపే ఇస్తామని  మంత్రి తెలిపారు. అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పొంగులేటి ప్రకటించారు. జనవరి నుంచి ఆసరా పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కానీ రైతులకు 13 వేల కోట్ల రూపాయలతో త్వరలోనే డబ్బులు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version