Tech
Microchip Technology: ఇకపై మైక్రోచిప్స్ నగరం.. ఉస్మానియాలో పరిశోధనలు

Microchip Technology: ఇకపై మైక్రోచిప్స్ నగరం.. ఉస్మానియాలో పరిశోధనలు.. సక్సెస్ అయితే నా సామిరంగ..
హైదరాబాద్ ఇప్పుడు మైక్రోచిప్ తయారీకి ప్రపంచంలో ఒక ప్రముఖ కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశం ఏటా లక్షల కోట్ల రూపాయల మైక్రోచిప్‌లను దిగుమతి చేసుకుంటోంది, అయితే ఈ సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రయత్నాలు ప్రారంభించింది.

మైక్రోచిప్‌ల వినియోగం – ఆధునిక ప్రపంచంలో కీలక పాత్ర
మైక్రోచిప్‌లు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సెల్‌ఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు, కార్ల నుంచి విమానాల వరకు అన్నింటిలోనూ మైక్రోచిప్‌లు ఉపయోగం. ఇవి లేకుండా ఆధునిక పరికరాలు పనిచేయడం అసంభవం. ప్రతి సంవత్సరం మన దేశం మైక్రోచిప్‌ల దిగుమతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ దిగుమతులపై మన ఆధారపడటాన్ని తగ్గించడానికి, స్వదేశీ పరిశోధనలు వేగవంతం చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది.
తైవాన్ ఆధిపత్యం – భారత్ ముందస్తు చర్యలు
ప్రపంచవ్యాప్తంగా మైక్రోచిప్‌ల తయారీలో తైవాన్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. చిన్న పరిమాణంలో ఉన్న, అధిక సామర్థ్యంతో పనిచేసే మైక్రోచిప్‌ల తయారీలో తైవాన్ దేశం ముందు వరుసలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు రూ. 1,29,703 కోట్ల విలువైన చిప్లను దిగుమతి చేసుకుంది. కానీ కరోనా సమయంలో మైక్రోచిప్‌ల ఎగుమతులు ఆగిపోవడం, తైవాన్ లాంటి దేశాల్లో చిప్‌ల సరఫరా కొరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.