Fashion

టీ షర్ట్ లూజ్‌గా ఉందని పక్కనపెడుతున్నారా.. ఇలా స్టైల్ చేయండి..

లూజ్ టీషర్ట్‌ని చాలా మంది ఇష్టపడరు. అలాంటివారు దీనిని ఎలా వేసుకుంటే స్టైల్‌గా ఉంటారో తెలుసుకోండి.

కొంతమంది లూజ్ టీ షర్ట్స్‌ని వేసుకోవడానికి ఇష్టపడితే.. మరికొంతమంది లూజ్‌గా ఉందని పక్కనపెడతారు. కానీ, అలా కాకుండా కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం, కొన్ని కొత్తగా కాంబినేషన్‌తో ట్రై చేస్తే లూజ్ టీ షర్ట్ కూడా చూడ్డానికి చక్కగా ఫ్యాషన్‌గా కనిపిస్తుంది. మరి అవేంటో తెలుసుకోండి.

స్కర్ట్స్..

స్కర్ట్స్..

డెనిమ్ స్కర్ట్స్‌తో కూడా టీ షర్ట్స్‌ని పెయిర్ చేయొచ్చు. దీని వల్ల ఫ్యాషన్ లుక్ మీ సొంతమవుతుంది. ఇవి ట్రెండీగా, ఫ్యాషన్‌గా కనిపిస్తాయి. కాబట్టి, చక్కగా స్కర్ట్‌తో స్టైల్ చేయండి. అలానే..ట్రాక్ ప్యాంట్స్‌కి జతగా టీషర్ట్స్‌ని పెయిర్ అప్ చేయొచ్చు. వీటి వల్ల ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. దీనికి స్నీకర్స్ మరింత కంఫర్ట్‌ని ఇస్తాయి. కాబట్టి, ఇలా ట్రాక్ ప్యాంట్స్‌తో హ్యాపీగా వేసుకోండి.

డంగరీస్..

ఇవి కూడా మంచి క్యాజువల్ వేర్.. ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్‌ని డంగరీస్‌తో వేసుకుంటే చూడ్డానికి, వేసుకోవడానికి కంఫర్ట్ అండ్ ట్రెండీగా కనిపిస్తారు. వీటిని వైట్ స్నీకర్స్‌తో పెయిర్‌ అప్ చేయండి.

షార్ట్స్..

ఇవి చూడ్డానికీ చాలా ఫంకీగా, ఫ్యాషన్‌గా కనిపిస్తాయి. ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్‌ని డెనీమ్ బ్లాక్, బ్లూ షార్ట్స్‌తో పెయిర్ అప్ చేస్తే ఫుల్ కంఫర్ట్‌తో పాటు స్టైలిష్‌గా కూడా కనిపిస్తారు.

చేతులని మడవడం..

టీ షర్ట్ చేతులు లూజ్‌గా ఉండడం వల్ల మరీ ఎక్కువగా లూజ్‌గా అనిపిస్తుంది. అలాంటప్పుడు దీనిని మీరు చక్కగా మడవండి. ఇది ఫ్యాషన్‌గా అనిపిస్తుంది. ఇక చివర్లో కాస్త ముడి వేసినట్టుగా ఉంటే దానిని క్రాప్ టాప్ లుక్‌లోకి మార్చొచ్చు.

బ్లేజర్..

ఏదైనా పార్టీకి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా బ్లేజర్‌తో ట్రై చేయండి. చూడ్డానికి కొత్తగా చాలా బావుంటుంది. దీనిని లోపల టక్ చేసి బెల్ట్ పెట్టి బ్లేజర్ వేస్తే చూడ్డానికి క్లాసీ లుక్ మీ సొంతం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version