Life Style
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అంజీర్ పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.. దూరంగా ఉంటేనే మంచిది..

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అంజీర్ పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.. దూరంగా ఉంటేనే మంచిది..
అంజీర్ పండ్ల వల్ల ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంది. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
అంజీర్ పండ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంజీర్ పండ్లనే అత్తి పండ్లు అంటారు. అంజీర్ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని పోషకాల గని అంటారు. విటమిన్ ఎ, విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అత్తి పండులో ఉన్నాయి. సహజ చక్కెరతో కూడిన జ్యూసీ డ్రై ఫ్రూట్ అంజీర్. అనేక కడుపు సంబంధిత సమస్యల్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రోజు తీసుకోవడం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో కూడా అత్తి పండు చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా అంజీర్ పండ్లను రోజూ తినడం వల్ల ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్‌గా మారతాయి.
ఈ పండ్లలో ఫైబర్ చాలా పుష్కలంగా లభిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తీసుకుంటే.. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. నానబెట్టిన అంజీర్ రోజూ తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంజీర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని రక్షిస్తాయి. అత్తి పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణ లభిస్తుంది. అయితే, ప్రముఖ డైటీషియన్ పర్మీత్ కౌర్ ప్రకారం.. అత్తి పండ్లు చిన్న వ్యాధులతో పోరాడటంలో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, కొందరు మాత్రం ఈ పండుకు దూరంగా ఉండాలి. లేదంటే అది వారికి హానికరం మారవచ్చని తెలిపారు.
చర్మ సమస్యలు..
అంజిర్ పండ్లు కొన్ని సార్లు హానికరం అంజీర్ పండ్లను తినడం వల్ల కొంతమందిలో చర్మ అలెర్జీలు వస్తాయని తేలింది. అందుకే చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అంజీర్ పండ్లకు దూరంగా ఉండాలీ . లేదంటే.. ఈ పండు వారి ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.
కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు
అత్తి పండ్లలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ సమస్య, ఉబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు అత్తిపండ్లు తీసుకోకపోవడమే మంచిది. లేదంటే అపానవాయువు, వాపు సంభవించవచ్చు. అంతేకాకుండా మలబద్ధక సమస్య మరింత తీవ్రం కావచ్చు.
కాలేయ సమస్యలు..
కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులు పొరపాటున కూడా అత్తి పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే అవి కాలేయ పనితీరును నెమ్మదిస్తాయి. దీంతో, అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది.
బరువు తగ్గాలనుకునేవారు..
బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో అంజీర్ పండ్లను చేర్చుకోకండి. వీరు అత్తి పండ్లకు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిని చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో.. మీరు బరువు తగ్గకపోగా.. పెరిగే ప్రమాదముంది.
ఎక్కువ తినకూడదు..
అంజీర్ పండ్లను ఎక్కువ మోతాదులో తినకపోవడమే ఉత్తమం. ఎక్కువ మోతాదులో తింటే సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అత్తి పండ్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదముంది. మహిళలు పీరియడ్స్ సమయంలో అత్తి పండ్లను తీసుకోకపోవడమే మంచిది.