Latest Updates
లెక్చరర్ మీద గెంతుకున్న విద్యార్థులు, అతనిపై పగబట్టి కుర్చీ కింద బాంబు పెట్టారు.

లెక్చరర్ మీద గెంతుకున్న విద్యార్థులు, అతనిపై పగబట్టి కుర్చీ కింద బాంబు పెట్టారు.
తాను ఇచ్చిన యాక్టివీటిని పూర్తిచేయని విద్యార్థులపై ఓ పంతులమ్మ కోప్పడ్డారు. తాను చెప్పిన పనిని చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిలో 15 మంది పిల్లలు ఉన్నా, కేవలం ఇద్దరు మాత్రమే హోం వర్క్ చేసారు. దీంతో ఆమె మరింత కలత చెందారు. 13 మందిని నిలబెట్టి.. ఎందుకు మీరు చేయలేదని ప్రశ్నించారు. మరోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు. ఇది ఆ విద్యార్థులకు నచ్చలేదు.
పాఠాలు బోధించే సమయంలో తమను మందలించిందని మహిళా లెక్చరర్‌పై పగబట్టిన ఇంటర్ విద్యార్థులు.. ప్రాంక్ పేరుతో ఆమె కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు. విస్మయానికి గురిచేసే ఈ సంఘటన హర్యానాలోని భివాని జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే, బపోరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ లెక్చరర్ 12వ తరగతి విద్యార్థులకు ఓ రోజు పాఠం చెప్పిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన యాక్టివిటీని విద్యార్థులు పూర్తిచేయకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 మంది విద్యార్థుల్లో 13 మందిని ఆ మహిళా లెక్చరర్ నెగలు పుట్టించారు.
దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు.. ప్రాంక్ పేరుతో లెక్చరర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి టపాసుల తరహాలో బాంబు తయారుచేశారు. శనివారం స్కూల్‌కు తీసుకొచ్చిన బాంబును లెక్చరర్ కుర్చీ కింద పెట్టారు. ఆమె తరగతి గదిలోకి వచ్చి కూర్చునప్పుడు, రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబు పేల్చారు. పేలుడు ధాటికి కుర్చీకి రంధ్రం పడింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ లెక్చరర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రాంక్ పేరుతో లెక్చరర్ పట్ల క్రూరంగా వ్యవహరించిన ఆ 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే వారి తల్లిదండ్రులు క్షమాపణ చెప్పడంతో అధికారులు వెనక్కి తగ్గారు. భవిష్యత్తులో అలాంటి పనులు మళ్లీ చేయబోమని విద్యార్థులను లిఖితంగా రాసి తీసుకున్నారు. ఆ మహిళా లెక్చరర్ కూడా తన విద్యార్థులను మన్నించింది.
మరోవైపు, ఈ ఘటనపై బపోరా గ్రామపంచాయతీ తీవ్రంగానే స్పందించింది. దీనిపై చర్చించడానికి గ్రామసభ ఏర్పాటుకు పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులు మందలించారని వారిపై ప్రతీకారం తీర్చుకోవడం సరి కాదు. సమాజం దీనిని తీవ్రమైన తప్పు అని భావిస్తుంది. అటు, విద్యా శాఖ అధికారులు సైతం తీవ్రంగా పరిగణించారు. ఇటువంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, తమ పిల్లలు ఏం చేస్తున్నారో? అనేది తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.