Latest Updates
కదులుతున్న అంబులెన్స్‌లో కిడ్నాప్ చేసి బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగిన ఘోర ఘటన చోటుచేసుకుంది.
కదులుతున్న అంబులెన్స్‌లో కిడ్నాప్ చేసి బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగిన ఘోర ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లో కదులుతున్న అంబులెన్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను కిడ్నాప్ చేసి అంబులెన్స్‌లోకి తీసుకెళ్లి, కదులుతుండగానే ఇద్దరు అత్యాచారం చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అంబులెన్స్ డ్రైవర్, అతని స్నేహితుడు కలిసి బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాలిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో ఈనెల 25న ఓ దారుణం జరిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలందించేందుకు తీసుకువచ్చిన జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లోనే ఈ ఘోరం జరిగింది. ఆ అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతని స్నేహితుడు రాజేష్ కేతవ్ కలిసి 16 ఏళ్ల బాలికను హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో చూశారు. ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించిన వారు, బలవంతంగా ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
అంబులెన్స్ కదులుతుండగా, వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేతవ్‌లు తలుపులు మూసుకొని ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఒక ప్రదేశంలో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా భయబ్రాంతులకు గురైన బాలిక దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితులు వీరేంద్ర, రాజేష్‌ను అరెస్ట్ చేశారు. వారిద్దరూ నైగర్హి తహసీల్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతం, నిందితుల గ్రామం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించగా, ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో ధృవీకరించారని మౌగంజ్ ఎస్పీ సర్నా ఠాకూర్ చెప్పారు.
![]()
