Andhra Pradesh
KRMB త్రిసభ్య కమిటీ సమావేశం: హైదరాబాద్, ఖమ్మంకు నీటి కేటాయింపు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ (AP) అధికారులు హాజరు కానప్పటికీ, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) అనిల్ కుమార్ హాజరయ్యారు. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం రోజూ 750 క్యూసెక్కులు, ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల కోసం 300 క్యూసెక్కుల నీటిని కేటాయించాలని ఆయన KRMBని కోరారు.
సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి స్థాయి 510 అడుగుల దిగువకు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు నీటిని పంపింగ్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. KRMB నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ నీటిని ఉపయోగించకూడదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి వ్యక్తం చేశారు.
తెలంగాణ అధికారుల ఈ డిమాండ్‌తో, నీటి కేటాయింపు విషయంలో KRMB తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.