News
KCRను మూడోసారి సీఎంను చేస్తాం: MLA
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానుందన్న దుష్ప్రచారాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, ఈ వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంతో పటిష్ఠంగా ఉందని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. ఎవరెన్ని కట్టుకథలు ప్రచారం చేసినా, పార్టీ బలంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. కొందరు నీచమైన రాజకీయాలతో పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి చీప్ రాజకీయాలను వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రజలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజా పక్షపాతిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.