Latest Updates
KC వేణుగోపాల్‌పై అమిత్ షా ఫైర్
130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ KC వేణుగోపాల్ మధ్య ఘర్షణాత్మక వాదన చోటుచేసుకుంది. ‘రాజకీయాల్లో నైతికత తీసుకొస్తామంటున్నారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ అరెస్టు కాలేదా?’ అని వేణుగోపాల్ ప్రశ్నించారు. దీనికి అమిత్ షా మండిపడుతూ.. ‘నాపై ఆరోపణలు తప్పుడు అయినప్పటికీ, అరెస్టు చేయడానికి ముందే నేను స్వయంగా రాజీనామా చేశాను. నిర్దోషిగా తేలే వరకు ఏ పదవీ చేపట్టలేదు’ అని స్పష్టంగా జవాబిచ్చారు.