movies
Jailer 2: బాలకృష్ణ బయటకు – ఫహాద్ ఫజిల్ ఎంట్రీతో రజనీకాంత్ సీక్వెల్‌కి కొత్త ట్విస్ట్!
 
																								
												
												
											సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, రజనీ కెరీర్‌లో మరో గోల్డెన్ హిట్‌గా నిలిచింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ గెస్ట్ అప్పియరెన్స్‌లు సినిమాకి స్పెషల్ ఆకర్షణగా నిలిచాయి. భారీ వసూళ్లతో పాటు అభిమానుల్లో రజనీ క్రేజ్‌ను మళ్లీ నిరూపించింది.
ఈ విజయానంతరం దర్శకుడు నెల్సన్ ‘జైలర్ 2’ సీక్వెల్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈసారి కథను మరింత యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్ సృష్టించాయి. ఆయన ఏపీకి చెందిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఓ స్పెషల్ రోల్ చేయనున్నారని, దాదాపు 20 నిమిషాల పాత్రకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారని ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ షెడ్యూల్ సమస్యల కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో పాటు, గోపీచంద్ మలినేని మరియు క్రిష్‌లతో కొత్త ప్రాజెక్టులలో కూడా భాగస్వామ్యం అవుతున్నారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ‘జైలర్ 2’కి టైం ఇవ్వలేకపోయారని ఫిలింసర్కిల్స్ చెబుతున్నాయి.
బాలయ్య ప్లేస్‌లో మలయాళ స్టార్ ఫహాద్ ఫజిల్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. దక్షిణాది ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న ఈ నటుడు రజనీతో గతంలోనూ పని చేశారు. ఈసారి ‘జైలర్ 2’లో ఆయన ఎంట్రీ సినిమాకి కొత్త లెవెల్ ఇవ్వబోతోందని ఫ్యాన్స్ అంటున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదటి భాగం రికార్డులు మించి మరింత సెన్సేషన్ సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
 

