Latest Updates
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు కప్ కొట్టడం కష్టమేనా?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లపై ముంబై ఒక్క విజయం కూడా సాధించలేదు. గుజరాత్ టైటాన్స్ (GT)పై రెండు సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS)పై ఒక్కోసారి ఓటమి చవిచూసింది. ఇప్పుడు క్వాలిఫయర్స్ మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌లలో కూడా ఇవే బలమైన జట్లు ముంబైకి ఎదురుగా నిలవనున్నాయి.
ఈ పరిస్థితుల్లో GT, RCB, PBKS వంటి బలమైన జట్లపై విజయం సాధించడం ముంబై ఇండియన్స్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ జట్ల బలమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుంటే, ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఐపీఎల్ కప్‌ను కైవసం చేసుకోవడం చాలా కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవాళ్లను అధిగమించి ముంబై తమ సత్తా చాటగలదా అనేది రాబోయే మ్యాచ్‌లలో తేలనుంది.