National
IPL మిగతా మ్యాచుల నిర్వహణ ఎక్కడంటే?
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచులను బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలు, ఉత్తర భారతంలో డ్రోన్, మిస్సైల్ దాడుల భయం ఉండటంతో దక్షిణ భారత నగరాలను సురక్షిత వేదికలుగా బీసీసీఐ ఎంచుకుంది.
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాలు మ్యాచులకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నగరాల్లో భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేస్తూ, అభిమానులు, ఆటగాళ్ల రక్షణకు బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తోంది. రవాణా, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఈ వేదికలు సౌకర్యవంతంగా ఉంటాయి. త్వరలో షెడ్యూల్ ఖరారు కానుంది.