Latest Updates

చైనా సరిహద్దులో ఉత్కంఠ.. భారత సైన్యం తొలి పెట్రోలింగ్ విజయవంతం..

తూర్పు లడ్డఖ్‎ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితి నెలకుంటోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, భారత్, చైనా సైనికులు సరిహద్దు వెంబడి కలిసి పెట్రోలింగ్ చేశారు, ఇది విజయవంతమైంది. మొదటి పెట్రోలింగ్ 2024 నవంబర్ 1న దేమ్‌చోక్‏లో భారత్, చైనా సైన్యాలు ప్రారంభించాయి. సోమవారం, అత్యంత సున్నితమైన ప్రాంతమైన దెప్సాంగ్‌లో భారత సైన్యం పెట్రోలింగ్ విజయవంతంగా పూర్తిచేసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆర్మీ ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ట్వీట్ చేసింది. దెప్సాంగ్‌లో ఒక ప్రాంతంలో పెట్రోలింగ్ విజయవంతంగా జరిగిందని, సరిహద్దు శాంతికి ఇది మంచి అడుగని తెలిపారు.

‘సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించి, దెప్సాంగ్, దేమ్‌చుక్‌లో పెట్రోలింగ్ మొదలుపెట్టాలని భారత్, చైనాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా దెస్పాంగ్‌లో పెట్రోలింగ్ విజయవంతంగా నిర్వహించాం.. వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, ప్రశాంతతను కొనసాగించేందుకు ఇది మరో సానుకూల అడుగు’ అని తెలిపింది. దెప్సాంగ్ సాంప్రదాయ పెట్రోలింగ్ పాయింట్ల వద్ద పెట్రోలింగ్ జరిగింది. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా 2013, 2015లో భారత్, చైనా దళాల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. దెప్సాంగ్ కుడివైపున ఆక్సాయ్ చిన్ ఉంది. తూర్పు లడ్డఖ్‎లోని 2020 మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గాల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.

సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో అప్పటి నుంచి భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఏసీ వెంబటి ఇరు దేశాలు భారీగా సైన్యాలను మోహరించాయి. ఇటీవల భారత్, చైనా అధికారులు మాట్లాడి, ఎల్ఏసీ వెంట సామాన్య పరిస్థితులు తీసుకురావాలని ఒప్పుకున్నారు. గతంలో మాదిరిగానే సరిహద్దుల వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలను ఉపసంహరించుకుని.. సమన్వయ పెట్రోలింగ్ నిర్వహించాలని అవగాహనకు వచ్చాయి.

మొదట దేమ్‌చోక్‏, దెప్సాంగ్ పాయింట్లలో సైన్యాన్ని ఉప-సంహరించి పెట్రోలింగ్ చేయాలని ఇరుదేశాలు సైనికాధికారులు నిర్ణయించారు. దేనికి అనుగుణంగా దేమ్‌చోక్, దెప్సాంగ్ పాయింట్లలో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తయింది. దీంతో దేమ్‌చోక్ ఇరు దేశాల సైనికులు సమన్వయ పెట్రోలింగ్ నవంబరు 1న మొదలుపెట్టారు. తర్వాత సోమవారం దెస్పాంగ్‌లో పెట్రోలింగ్ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version