Connect with us

Latest Updates

Election Results ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు, ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్, బీఎస్పీలు  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి.  సాధారణ మెజార్టీ 46. కానీ, హరియాణాలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నెలకుంది.

 జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం దిశగా సాగుతోంది. ఇండియా కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్సీ 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికలు కావడంతో ఫలితాలపై ఆసక్తి నెలకుంది. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిసి సభ్యుల సంఖ్య 95కు చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 48.

హరియాణా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యేలా ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, ఫలితాలు మాత్రం అందకు విరుద్దంగా వెలువడుతున్నాయి. అంచనాల భిన్నంగా భీజేపీ ఆధిక్యంలో వచ్చింది. హరియాణాలో వరుసగా ఏ పార్టీ మూడోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని బీజేపీ అధిగమించే అవకాశాలు ఉన్నాయి. గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Election Results 2024 Highlights: As results near, BJP faces uncertain  future in Haryana and J&K - The Economic Times

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. మొదట కాంగ్రెస్ భారీ ఆధిక్యం చూపగా.. 2 వ రౌండ్  లో బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. దీంతో విజయం ఎవర్ని వరిస్తుందోనని ఆసక్తి రేపుతుంది. ఇక, జులానాలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకబడ్డారు. ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి ఆమె 1200 ఓట్ల వెనుబడి ఉన్నారు. హిస్సార్‌ నుంచి బరిలో నిలిచిన బీజేపీ రెబల్ సావిత్రి జిందాల్.. కాంగ్రెస్ అభ్యర్ధిపై 3 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ కూటమి మ్యాజిక్ మార్క్‌ను దాటింది.,మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ రెండు చోట్ల  మాత్రమే ఆధిక్యంలో ఉండగా ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ మాత్రం వెనుకoజ లో ఉన్నారు . ఆమెపై ఎన్సీ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. పుల్వామాలో పీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉంది. కేవలం నాలుగు స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. 1999 తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఆ పార్టీ అత్యంత దారుణమైన పరాజయాన్ని చవిచూస్తోంది.

కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. నిమిష నిమిషానికి ట్రెండ్ మారుతోంది. దీంతో హరియాణా ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి గెలుపొందేల ఉంది . ఇప్పటి వరకూ వెలువడిన జమ్మూ కాశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాల సరళిని బట్టి రెండు చోట్ల ఇండియా కూటమి ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయిదీంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద సంబరాలు మొదలయ్యాయి. హరియాణాలో ఆ పార్టీ బంపర్ విక్టరీ కొట్టే దిశగా వెళ్తోంది.

ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కశ్మీర్‌లో మొత్తం  అసెంబ్లీ  స్థానాలు 90 గానూ 50 చోట్ల కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి, 30 చోట్ల బీజేపీ, 6 చోట్ల పీడీపీ ఉన్నాయి. ఇక, హరియాణాలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం పార్టీ సాగుతోంది. అధికార బీజేీ పీకి మింగుడపడని ఫలితాలు వెలువడుతున్నాయి.

కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీచేసిన రెండు చోట్లా ఆదిక్యంలో ఉన్నారు. గందెర్‌బల్, బుద్గాంలో ఆయన ముందంజలో ఉన్నారు. నౌషిరాా స్థానంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్సుడు రవీందర్ రైనా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Loading