Business
Income Tax Refund ఆలస్యమైందా? ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది
ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీరు చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ మొత్తం ప్రభుత్వానికి వెళ్లితే, ఆ అదనపు మొత్తాన్ని రిఫండ్ రూపంలో తిరిగి పొందుతారు. అయితే కొన్నిసార్లు రిఫండ్ ఆలస్యమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో పన్ను చెల్లింపుదారుడి నుంచి ఎలాంటి తప్పు లేకపోతే, ఆదాయపు పన్ను శాఖ ఆలస్యమైన రిఫండ్ మొత్తంపై నెలకు 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి మొత్తం 6 శాతంగా పరిగణించబడుతుంది.
ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్ దాఖలు అయిన తర్వాత 30 రోజుల్లోపు ఇ-వెరిఫికేషన్ పూర్తి చెయ్యాలి. ధృవీకరణ పూర్తయితే సాధారణంగా ITR ప్రాసెసింగ్‌కు 20 నుంచి 45 రోజులు పడుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత రిఫండ్ బ్యాంక్ ఖాతాలో 2–10 రోజుల్లో జమ అవుతుంది. అయితే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ త్వరగా వస్తుండగా, కొంత మంది నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. తప్పులేని పరిస్థితుల్లో ప్రభుత్వం వడ్డీతో కూడిన రిఫండ్ ఇవ్వాల్సిందే.ఇన్‌కం టాక్స్ చట్టంలోని సెక్షన్ 244A ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి రిఫండ్ జమ అయ్యే తేదీ వరకు వడ్డీ లెక్కిస్తారు. అయితే గడువు దాటి రిటర్న్ ఫైల్ చేసినవారికి వడ్డీ లెక్కింపు ITR దాఖలు చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. టీడీఎస్, అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్-అసెస్‌మెంట్ టాక్స్ ద్వారా అధిక పన్ను చెల్లించినప్పటికీ, మీ తరఫున వివరాల్లో పొరపాటు ఉన్నా, తప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా, నోటీసులకు స్పందించకపోయినా వడ్డీ లభించదు.రిఫండ్ ఆలస్యమయ్యే ముఖ్య కారణాల్లో ఫారం 26AS, AIS, TIS డేటా – ITR వివరాలు సరిపోకపోవడం, బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేషన్ చేయకపోవడం, PAN–Aadhaar లింక్ లేకపోవడం, రిటర్న్‌ను 30 రోజుల్లోపు ఇ-వెరిఫై చేయకపోవడం ఉన్నాయి. అలాగే పూర్వ సంవత్సరపు పెండింగ్ పన్ను డిమాండ్లు ఉన్నా రిఫండ్ ఆగిపోతుంది. ఆదాయ వర్గాలు ఎక్కువగా ఉండేవారి రిటర్న్లు అదనంగా స్క్రూటినీకి వెళ్లడం కూడా ఒక కారణం.
![]()
