Telangana

HYD: స్విమ్మింగ్ పూల్.. నెలకు కేవలం రూ.500తో ఈత నేర్చుకోండి!

ycube news

హైదరాబాద్‌లో జరుగుతున్న సమ్మర్ క్యాంప్‌కు విశేష స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న బీవీ గురుమూర్తి స్విమ్మింగ్ పూల్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆధ్వర్యంలో ఈత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది అనుభవజ్ఞులైన కోచ్‌లు ఈతతో పాటు ఇతర ఆటలను నేర్పిస్తున్నారు.

ఆసక్తి ఉన్నవారు GHMC అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు కేవలం రూ.500 చెల్లించడం ద్వారా ఈత నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. శిక్షణ సమయాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఉంటాయి. GHMC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్ యువతకు, పిల్లలకు ఈత నేర్చుకునేందుకు గొప్ప వేదికగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version