News
HYD మార్కెట్లకు పచ్చడి కళ
ప్రస్తుతం ఒక్కో పచ్చడి కాయ ధర రూ.20 నుంచి రూ.25 మధ్య ఉంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే వ్యాపారులు ధరలో స్వల్ప తగ్గింపు కల్పిస్తున్నారు. అలాగే, కాయ కటింగ్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో స్టాక్ త్వరగా అయిపోతోందని వ్యాపారులు చెబుతున్నారు. పచ్చడి కాయలతో రుచికరమైన వంటకాలు తయారు చేసేందుకు గృహిణులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సీజన్‌లో మీరూ మార్కెట్‌కి వెళ్లి పచ్చడి కాయలు కొనుగోలు చేయడం మర్చిపోవద్దు!