Life Style
పిల్లో కవర్స్ ఎంత ఉతికినా మరకలు పోవట్లేదా.. వీటిని వాడండి

చాలా మంది పడుకునేటప్పుడు దిండ్లు వాడతారు. కొంతమందికి ఇవి లేకపోతే నిద్ర కూడా పట్టదు. కొంతమంది వీటిని వాడకపోయిన హగ్ చేసుకుని పడుకుంటారు. ఇలా చాలారకాలుగా పిల్లోస్‌ని వాడుతుంటాం. వీటిని వాడినప్పుడు సాధారణంగా చాలా మరకలు పడుతుంటాయి. మన నుంచి వచ్చే చెమట, జిడ్డు వాటిపై పడి మరకలు కనిపిస్తాయి. అంతేకాదు, దీని వల్ల బ్యాక్టీరియా పెరిగి అలర్జీలకి కారణమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మరి ఈ దిండ్లని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.
ఉతికేముందు..
దిండ్ల కవర్స్ వాష్ చేసే ముందు.. వాటిని సరిగా ఎలా క్లీన్ చేయాలో లేబుల్‌ని చెక్ చేయాలి. ఆ విధంగానే క్లీన్ చేయాలి. అదే విధంగా వీటిని కనీసం వారానికోసారి ఉతకడం మంచిది. ఉతికేందుకు డిటర్జెంట్‌ని వాడతారు. అయితే, మరకలు పోవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే..
ఉతికేటప్పుడు..
ఈ పిల్లో కవర్స్‌ను ఎక్కువగా చేతితో ఉతకడం మంచిది. వాషింగ్ మెషిన్‌లో వాడినప్పుడు చల్లని లేదా గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ వేసి మెల్లిగా ఉతకాలి. దీని వల్ల కిర్లలు పోతాయి. వాష్ చేసేటప్పుడు కొంచెం వైట్ వెనిగర్ కలిపి వాష్ చేయండి.
వైట్ వెనిగర్..
వైట్ వెనిగర్ కూడా బట్టలపై పడిన కిర్లలను సులభంగా పోగొట్టేలా చేస్తుంది. దీనికి, వైట్ వెనిగర్ మరియు నీటిని సమానంగా తీసుకుని బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కిర్లలపై స్ప్రే చేయాలి. దాదాపు 15 నిమిషాలు అలానే ఉంచండి. తర్వాత రెగ్యులర్‌గా వాష్ చేసేటట్టు వాష్ చేయండి. కిర్లలు చాలా వరకు పోతాయి.
బేకింగ్ సోడా..
పిల్లో కవర్స్‌పై ముందు బేకింగ్ సోడా చల్లాలి. అరగంట పాటు అలానే ఉంచాలి. ఇది దిండ్లపై ఉన్న జిడ్డు మరకలను పీల్చుకుంటుంది. ఆ తర్వాత వీటిని వాష్ చేయాలి.
ఎండ తగిలేలా..
అదే విధంగా ఉతికిన పిల్లో కవర్స్‌ని గాలి, ఎండ బాగా వచ్చే చోట ఆరేయాలి. ఇలా చేస్తే వాటిపై ఉన్న మరకలు తగ్గుతాయి. అలాగే అలర్జీలకు కారణమయ్యే బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది.