Connect with us

Andhra Pradesh

HHVM ప్రీరిలీజ్ ఈవెంట్కు మూడు రాష్ట్రాల మంత్రులు!

HHVM Event: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్.. గెస్ట్‌లు  ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈనెల 21న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సినిమా పరిశ్రమతోపాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరవనున్నారని సమాచారం. అలాగే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ ఈవెంట్‌ను గౌరవించనున్నారు. సినిమా విడుదలకు మద్దతుగా, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశముంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *