Connect with us

Entertainment

Devara First Day Collections: కళ్లు చెదిరే వసూళ్లు! – ఏకంగా ఎన్ని కోట్లంటే?

‘దేవర’ ఓపెనింగ్స్​ – కళ్లు చెదిరే వసూళ్లు! – ఏకంగా ఎన్ని కోట్లంటే? – Devara First Day Collections

DEVARA FIRST DAY COLLECTIONS : భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన దేవర సినిమాకు మొదటి రోజే ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా తొలి రోజు ఎంత వసూళ్లు సాధించిందంటే?

 భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన దేవర సినిమాకు మొదటి రోజే ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చిన చిత్రమిది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజైందీ చిత్రం. సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించగా, విలన్ భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు.

యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవర హిట్​ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు.

‘దేవర’ తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్ట్ డే దేవరకు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు వసూలు చేసినట్లు అంటున్నారు. ఇండియాలో అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.77 కోట్లు నెట్​ అందుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇతర భాషలలో హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు సమాచారం.

‘దేవర’ను ఆదరించినందుకు ప్రేక్షకులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు చెప్పారు. “నా ఫ్యాన్స్ చేసుకుంటున్న వేడుకలు చూసి నా మనసు నిండిపోయింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాలాగే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే ఆనందంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నాను” అని తారక్​ పేర్కొన్నారు. దర్శకుడు కొరటాల శివ కూడా ఇంత భారీ విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Loading