Connect with us

Entertainment

కృతి శెట్టికి మళ్లీ నిరాశే… డబ్బింగ్‌ తోనూ హిట్‌ పడలేదు

మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్‌ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీ సూపర్‌ హిట్‌ అయింది. తక్కువ సమయంలోను ఉప్పెన మూవీ భారీ వసూళ్లు నమోదు చేసింది. హీరో హీరోయిన్‌ ఇద్దరూ కొత్త వారు అయినా ఉప్పెన మూవీ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో రికార్డ్‌ లు నమోదు అయ్యాయి. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న హీరోయిన్‌ కృతి శెట్టికి ఓవర్‌ నైట్‌ స్టార్‌ డమ్ దక్కింది. అందుకు తగ్గట్లుగానే భారీ ఎత్తున ఆఫర్లు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్‌ మూడు నాలుగు సినిమాలు సక్సెస్ అవ్వడంతో మరింతగా బిజీ అయింది. కృతి శెట్టికి ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది.

టాలీవుడ్‌ లో ఆఫర్లు రాకపోవడంతో తమిళ్‌, మలయాళ సినిమాల వైపు కృతి శెట్టి అడుగులు వేసింది. అక్కడ ఒకటి రెండు మంచి ఆఫర్లు వచ్చాయి. ఇటీవల మలయాళ యంగ్‌ స్టార్‌ నటుడు టోవినో థామస్‌ కి జోడీగా ‘ARM’ సినిమాలో నటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ARM’ చిత్రం కేరళ లో డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకుని లాంగ్ రన్‌ లోనూ మంచి వసూళ్లు రాబడుతూ సేఫ్ ప్రాజెక్ట్‌ గా నిలువబోతుంది. అయితే తెలుగు లో కృతి శెట్టికి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ‘ARM’ ను డబ్బింగ్‌ చేసి భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. హీరో టోవినో థామస్ తో పాటు హీరోయిన్‌ కృతి శెట్టి తెలుగు లో ప్రమోషన్ కోసం రెండు రోజుల సమయం కేటాయించారు. అయినా ఫలితం దక్కలేదు.

పెద్దగా పోటీ లేని సమయంలోనే ‘ఏఆర్‌ఎం’ సినిమా తెలుగు బాక్సాఫీస్‌ వద్దకు వచ్చింది. అయినా ప్రేక్షకుల తిరష్కరణ కి గురి అయింది. మలయాళంలో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్న ARM సినిమాను తెలుగు లో ప్రేక్షకులు కనీసం పట్టించుకోవడం లేదు. ప్రమోషన్ ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ట్రోల్స్ వస్తున్నాయి. నెట్టింట జరుగుతున్న ప్రచారం కారణంగా ఇప్పటికే చాలా థియేటర్ల నుంచి ARM ను తొలగించి మత్తు వదలరా 2 సినిమాను వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్‌ వద్ద పూర్తి స్థాయి ఆధిపత్యంను మత్తు వదలరా 2 సినిమా చూపిస్తోంది.

తెలుగు లో ARM సక్సెస్ అయితే మళ్లీ టాలీవుడ్‌ లో ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని బేబమ్మ ఆశ పడింది. కానీ దురదృష్టం కంటిన్యూ అయింది. తెలుగు లో మరోసారి కృతి శెట్టికి నిరాశే మిగిలింది. ARM లో టోవినో థామస్, కృతి శెట్టి తో పాటు కీలక పాత్రల్లో ఐశ్వర్య రాజేష్‌, సురభి లక్ష్మి, బాసిల్‌ జోసెఫ్‌, జగదీష్‌, కబీర్‌ దుహన్ సింగ్‌, ప్రమోద్ శెట్టిలు నటించారు. ఈ సినిమాలో టోవినో థామస్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. టోవినో కి తెలుగు లో పెద్దగా గుర్తింపు లేక పోవడం వల్ల సినిమాకు మినిమం వసూళ్లు నమోదు అవ్వలేదు. తెలుగు లో మరో అవకాశం కావాలంటే బేబమ్మ మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే.

Loading