Connect with us

Entertainment

‘దేవర’ ఆయుధ పూజకి ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్‌కి మతి పోవడం ఖాయం

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత రాబోతున్న సినిమా ‘దేవర’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాను వచ్చే వారంలో 27వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాలున్న దేవర సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన మూడు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇటీవలే నాల్గవ పాటగా ఆయుధ పూజ.. పాట రాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రచయిత రామజోగయ్య శాస్త్రి ఇటీవల ఆయుధ పూజ పాట గురించి ట్వీట్‌ చేసి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెంచాడు. రేపు పాటను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా ఎన్టీఆర్‌, ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు ఇటీవలే ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముంబైలో జరిగిన ఈవెంట్‌ లో ట్రైలర్ ను లాంచ్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం దేవర యూనిట్‌ సభ్యులు మొత్తం చెన్నైలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న తమిళ మీడియా తో ఏర్పాటు చేసిన సమయంలో దేవర పాటలను విడుదల చేయడం జరిగింది. రేపు సినిమా నుంచి మరో ఆసక్తికర పాట విడుదల అవ్వనుంది.

ఇటీవల చిత్ర యూనిట్‌ సభ్యులు ‘దేవర’ నుంచి పవర్‌ ఫుల్‌ ఆయుధ పూజ పాట విడుదల అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. రచయిత రామజోగయ్య శాస్త్రి వరుస ట్వీట్స్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాడు. ఆయుధ పూజ పాట బ్లాస్ట్‌ చేయడం ఖాయం అన్నాడు. రామజోగయ్య శాస్త్రి ట్వీట్స్ తర్వాత ఎప్పుడెప్పుడు ఆయుధ పూజ సాంగ్ వస్తుందా అంటూ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మేకర్స్ నుంచి ఆయుధ పూజ పాట అనౌన్స్మెంట్ వచ్చింది. ఎన్టీఆర్‌ ను పవర్‌ ఫుల్‌ లుక్ లో చూపిస్తూ ఆయుధ పూజ పాట ను ప్రకటించారు.

సాంగ్ వచ్చేది అప్పుడే
రేపు ఉదయం 11.07 గంటలకు యూట్యూబ్‌ ద్వారా ఆయుధ పూజ పాటను ఫ్యాన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. అనిరుధ్‌ మరోసారి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే విధంగా ఆయుధ పూజ పాట ట్యూన్ ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డ ఈ సమయంలో రాబోతున్న ఈ పాట పై అందరిలోనూ ఆసక్తి ఓ రేంజ్ లో ఉంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయుధ పూజ పవర్‌ ఫుల్ గా ఉంటుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఆయుధ పూజకు ముందు ఫియర్ సాంగ్ వచ్చి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించిన అనిరుధ్‌ ఈసారి ఫ్యాన్స్ మతి పోగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Loading