Connect with us

Entertainment

సినిమాలో తప్పులు చూపిస్తే పార్టీ ఇస్తా!.. లక్కీ భాస్కర్‌‌పై నాగవంశీ కామెంట్స్

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన క్రేజీ మూవీ ‘లక్కీ భాస్కర్‌’ దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేయడం తో ఈ సినిమాపై ఎక్కువుగా అంచనాలు పెంచారు. భారీ ఎత్తున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను నిర్మాత నాగవంశీ ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ మధ్య కాలంలో విడుదలైన ఎక్కువ సినిమాలు మంచి ఫలితాల్ని దక్కించుకున్నాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ట్రైలర్‌లో దుల్కర్‌ సల్మాన్‌ పాత్రతో పాటు వెంకీ అట్లూరి చూపించబోతున్న కథ, కథనం సినిమాపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆయనకు ఉన్న నమ్మకంను చూపిస్తున్నాయి. ఈ సినిమాలో మీరు ఎక్కడ చుసిన తప్పులు ఉండవు, ఎవరైనా తప్పులు పట్టుకుంటే వారిని పిలిచి పెద్ద పార్టీ ఇస్తా, వారితో ఫోటో కూడా దిగుతా అని అన్నారు. సాధారణంగా సినిమాలంటే ఏదో ఒక తప్పు ఉండటం సహజం. కానీ ఎన్ని తప్పులు ఉన్నా సినిమాలు హిట్‌ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే లక్కీ భాస్కర్‌లో ఒక్క తప్పు కూడా ఉండదని నిర్మాత నాగ వంశీ చెబుతున్న విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది. రివ్యూవర్స్‌ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే లక్కీ భాస్కర్‌ సినిమాలో తప్పులు వెతికి పట్టుకుని నిర్మాత నాగవంశీ నుంచి పార్టీ తీసుకుని, ఆయనతో ఫోటో దిగుతామని కొందర రివ్యూవర్స్ చెప్తున్నారు. సోషల్‌ మీడియాలో వంశీ అతి మాటలు ఈ మధ్య కాలంలో వైరల్‌ అవుతున్నాయి. ఈ తప్పుల మాటలు సైతం అదే తరహాలో ఉన్నాయని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలకు బజ్ క్రియేట్‌ చేయడం కోసం నాగవంశీ ఇలాంటి మాటలు మాట్లాడటం, దాని ద్వారా సినిమా వార్తల్లో నిలిచి మంచి బజ్ క్రియేట్‌ చేయడం ఈ మధ్య కాలంలో మనం కామన్‌గా చూస్తూనే ఉన్నాం. లక్కీ భాస్కర్‌ విషయంలోనూ అదే ప్రమోషనల్‌ స్టంట్‌ను నిర్మాత నాగవంశీ వాడి ఉంటారా లేదంటే నిజంగానే సినిమాలో తప్పులు అనేవి వెతికినా దొరకవు అని ఆయన భావిస్తున్నారా అనేది చూడాలి.

ఇక దుల్కర్‌ సల్మాన్‌ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. తెలుగులోనూ ఈయన ఇప్పటికే మహానటి, సీతారామం సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన డైరెక్ట్‌ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ ఉన్న దుల్కర్‌ సల్మాన్‌ ను లక్కీ భాస్కర్‌ ఫ్యామిలీ ఆడియన్స్ చెంతకు చేర్చుతుందా చూడాలి.

Loading