Connect with us

Andhra Pradesh

భీమవరంలో ఓ డాక్టర్ రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు.. సైబర్ ఫ్రాడ్..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అమాయకంగా ఓ డాక్టర్ రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్‌ పోలీసుల పేరు చెప్పి డబ్బుల్ని కొట్టేశారు దుండగులు. ఇటీవల పట్టణానికి చెందిన డాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.. తాము సైబర్‌ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. ‘ముంబై నుంచి మీ పేరు మీద ఒక పార్సిల్‌ వచ్చిందని.. అందులో 5 పాస్‌పోర్టులు, ఏటీఎం కార్డులు, డ్రగ్స్ ఉన్నాయి’ అని వాళ్ళు చెప్పారు. మాకు కొరియర్‌ సంస్థ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని.. విచారణ కోసం పూర్తి వివరాలు చెప్పమన్నారు.

ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి తాము అధికారులమని చెప్పి ఫోన్‌ చేసి బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగారు. డాక్టర్ కూడా నిజమేనని భావించి.. ఆయన తన అకౌంట్ నంబర్ల వివరాలు చెప్పారు. ఆ అకౌంట్‌లలో రూ.72 లక్షలు ఉన్నాయని.. తాము చెప్పిన అకౌంట్‌కు బదిలీచేయాలని సూచించారు. డాక్టర్ ఎందుకని వారిని ప్రశ్నించగా.. ‘ఇంత సొమ్ము మీకు ఎలా వచ్చిందో సరిచూడాలని.. తిరిగి మీ ఖాతాల్లో జమ చేస్తామని’ వారు చెప్పారు. ఆ డబ్బుల్ని వారి అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఎంతకీ డబ్బులు తిరిగి తన అకౌంట్లోకి జమ కాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కూడా సైబర్ మాసం జరిగింది. నర్సీపట్నం రూరల్ నీలం పేటకు చెందిన మాకిరెడ్డి కల్పన అనే ఆమె షేర్ ఛాట్ యాప్ ఉపయోగిస్తుంది. ఆమె షేర్‌ఛాట్ యాప్‌లో ఉద్యోగాల కోసం వెతికే క్రమంలో ఓ లింకు కనిపించగా ఓపెన్‌ చేశారు. ఆ లింక్‌లో ఉన్న ప్రకటన ఆమెను ఆకట్టుకుంది. మహిళలకు సంబంధించిన వస్తువుల వివరాలను తాము చెప్పిన విధంగా షేర్‌ చేస్తే డబ్బులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు.

ఆమె కూడా నిజమేనని భావించి.. ముందు రూ. 130 బోనస్‌తో మొదలు పెట్టగా.. వారు కూడా ప్రారంభంలో కొంత డబ్బులు ఇచ్చారు. ఆమె వారి మాటలు నమ్మి 21సార్లు వారు చెప్పిన విధంగా రూ. 3.79 లక్షలు వాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే బోనస్‌లు ఆగిపోవడంతో అకౌంట్ బ్లాక్‌ అయ్యిందని నమ్మించారు. చివరికి మోసపోయానని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *