Tours / Travels
Dasara Vacation:దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నరా.

Dasara Vacation: దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా.. అక్టోబర్‌లో ఈ ప్రదేశాల టూర్ బెస్ట్ ఎంపిక
అక్టోబరు నెలలో భారత దేశంలో చాలా పర్యాటక ప్రదేశాల అందం మరింత పెరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. శీతాకాలానికి ముందు దసరా సెలవులలో విహారయాత్రకు వేల్ల్లడానికి ప్లాన్ చేస్తున్నారా.. ఈ పర్యటన ద్వారా అత్యుత్తమ జ్ఞాపకాలను దాచుకునే ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో ట్రావెల్ డైరీ కోసం ఎంచుకునే బెస్ట్ గమ్యస్థానం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

అక్టోబరు నెలలో భారత దేశంలో చాలా పర్యాటక ప్రదేశాల అందం మరింత పెరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. శీతాకాలానికి ముందు దసరా సెలవులలో విహారయాత్రకు వేల్ల్లడానికి ప్లాన్ చేస్తున్నారా.. ఈ పర్యటన ద్వారా అత్యుత్తమ జ్ఞాపకాలను దాచుకునే ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో ట్రావెల్ డైరీ కోసం ఎంచుకునే బెస్ట్ గమ్యస్థానం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..
జమ్ము కాశ్మీర్
కాశ్మీర్ అందాన్ని అలనాటి కవుల నుంచి నేటి సినిమా కవులు కూడా వివిద రకాలుగా వర్ణించారు. ఇది భారతదేశంలో అందమైన ప్రదేశం. ఒకసారి జమ్ము కాశమిరె చూస్తే మళ్ళీ తిరిగి రావాలి అనిపించదు. అందువల్ల ఇది భారతదేశానికి అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది.
రిషికేశ్, ఉత్తరాఖండ్
గంగా నది ఒడ్డున ఉన్న రిషికేశ్‌ను యోగా సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి . అయినప్పటికీ రుషికేష్ పర్వతాల మధ్య ఉన్న ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ అంటే NCR నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయిన రిషికేశ్‌కి ట్రిప్ ప్లాన్ చేయాలి. వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశం ఒక రకమైన భూతల స్వర్గంగా మారుతుంది. ఇక్కడ రోమింగ్‌తో పాటు రివర్ రాఫ్టింగ్ వంటి అనేక కార్యకలాపాలు కూడా చేయవచ్చు.
హంపి, కర్ణాటక
దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా పిలుస్తారు. ఇక్కడ రాయల కాలం నాడు నిర్మించిన పురాతన భవనాల నిర్మాణ సౌదర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో దక్షిణ భారతదేశంలోని ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఉత్తమం. హంపిలో ఉన్న చారిత్రక కట్టడాలు చరిత్రను గొప్పగా చెబుతాయి.
మున్నార్, కేరళ
భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో కేరళ ఒకటి. టీ తోటలు, బీచ్‌లు , పచ్చదనంతో నిండి ఉన్న కేరళ వర్షాకాలంలో స్వర్గంలా అనిపిస్తుంది. ఆకు పచ్చ చెట్లతో ప్రకృతి దుప్పటి పర్వతాలను కప్పివేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ పర్యటనకు మరింత థ్రిల్‌ని ఇస్తుంది. కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన మున్నార్‌ను సందర్శించడం వేరే విషయం. ఇక్కడ హౌస్‌బోట్‌లో సవాలీని సందర్శించడానికి, బీచ్‌లోని ప్రశాంతత, ప్రకృతి అందాలను చూడటానికి అక్టోబర్ నెల ఉత్తమ సమయం.