Andhra Pradesh
call money : కాల్ మనీ దందాలు ఆగడాలు… ఊరు వదిలి వెళ్లిపోతున్న మహిళలు

ఏలూరు (Eluru)లో కాల్ మనీ వేధింపులు పెచ్చుమీరాయి కరోనా సమయంలో తీసుకున్న అప్పునకు ఇప్పటికీ వడ్డీలు కట్టించుకుంటూనే ఉన్నారు రూ. 25 వేలు, 30 వేలు, 40 వేలు తీసుకున్న వారి నుంచి రూ.5 లక్షలకు పైగా వడ్డీ వసూలు చేశారు అయినా ఇంకా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు కట్టకపోతే ఒప్పుకోమంటూ భయపెడుతున్నారు. ఇంటి వద్దకు వెళ్లి పరువు తీస్తున్నారు. అసభ్యకరంగా పవర్తిస్తున్నారు. దీంతో బాధితులు ఊళ్లు వదిలివెళ్లిపోతున్నారు. కాల్మనీ కేటుగాళ్ల వేధింపులు
భరించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 మంది బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Eluru: ఏలూరులో కాల్ మనీ దందా.. వెలుగులోకి వైకాపా నేత ఆగడాలు
వైకాపా నేత కాల్ మనీ దందాకు తాము బలయ్యామని ఏలూరులో బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పు ఇచ్చి దానికి ఇష్టమొచ్చినట్లు వడ్డీలు కట్టించుకునే వారని, సమయానికి కట్టకపోతే అసభ్యపదజాలంతో తిట్టేవారని బాధితులు వాపోతున్నారు. భయపడి కట్టినా ఇంకా బకాయి ఉన్నారంటూ అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ప్రామిసరీ నోట్లతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని చెబుతున్నారు.