Latest Updates
BRS విలీనం గురించి కవిత మాట్లాడినది నిజమే: BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. బీఆర్ఎస్ నేత కవిత మాట్లాడిన బీజేపీ-బీఆర్ఎస్ విలీనం గురించిన విషయం నిజమేనని ఆయన స్పష్టం చేశారు. “పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు. మా నేతలు ఎక్కడ నుంచి పోటీ చేయాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయి. అందుకే బీజేపీ నష్టపోయింది,” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ప్రతి ఎన్నికల్లోనూ కొందరు బీజేపీ నేతల కుమ్మక్కు వల్ల పార్టీ నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “బీజేపీ ఇంకా తెలంగాణలో అధికారంలోకి ఎందుకు రాలేదో పార్టీ నాయకత్వం ఆలోచించాలి,” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి, బీజేపీ అధిష్ఠానం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది.