International
BREAKING: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వేళ ఇరాక్‌పై డ్రోన్ దాడి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, మరో దేశమైన ఇరాక్‌పై దాడి జరిగింది. బాగ్దాద్‌లోని ఓ మిలిటరీ బేస్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు ఇరాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ వలీద్ అల్ తమీమి వెల్లడించారు. ఈ దాడిలో ఎవ్వరికీ ప్రాణహానీ జరగలేదని తెలిపారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
అయితే, ఈ దాడి ప్రధానంగా ఇరాక్‌లోని ఫ్రెంచ్ మేడ్ రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాడార్ వ్యవస్థను అమెరికా 2020లో ఇరాకీ ఆర్మీకి అప్పగించిన సంగతి తెలిసిందే. యుద్ధ పరిస్థితుల్లో ఈ దాడి మరింత గంభీరతను తెచ్చిపెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు.