Entertainment
Bigg Boss 8 Fourth Week Elimination ఈ సీజన్లో తొలిసారి డబుల్ ఎలిమినేషన్!

గ్‌బాస్ 8: ఆమె కోసం అతడు బలి! – ఈ సీజన్లో తొలిసారి డబుల్ ఎలిమినేషన్!? – Bigg Boss 8 Fourth Week Elimination
Bigg Boss 8 Fourth Week Elimination బిగ్‌బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని సమాచారం. మరి ఈ లెక్కన ఇంటి నుంచి బయటికి వెళ్లేదెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్ సీజన్ 8 మంచి రంజుగా సాగుతోంది. గొడవలు, అలకలు, మాటలు, టాస్కులు, లవ్‌ట్రాక్స్‌తో దూసుకుపోతోంది. ఇక ఇంట్లోకి అడుగు పెట్టిన 14 కంటెస్టెంట్లలో ముగ్గురు ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని సమాచారం. మరి ఈ లెక్కన ఇంటి నుంచి బయటికి వెళ్లేదెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నామినేషన్లలో ఉన్నది వీళ్లే: నాలుగో వారం నామినేషన్లు హాట్‌హాట్‌గా సాగాయి. ముఖ్యంగా సోనియా – నబీల్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. అలా ఈ వారం నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనిక నామినేట్ కాగా.. చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్‌తో నైనికను సేవ్ చేశాడు. దీంతో నైనిక మినహా మిగిలిన వారు అంటే ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఓటింగ్.. శుక్రవారం వరకు కొనసాగింది.
ఎవరు టాప్‌లో.. ఎవరు లీస్ట్‌లో: ఈ వారం తన ఆట తీరుతో నబీల్ రేంజు పెరిగింది. ముఖ్యంగా సోనియా, పృథ్వీ, నిఖిల్ ఆట తీరుపై నబీల్ మాట్లాడిన పాయింట్స్ జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. దీంతో అతనికి ఊహించని రేంజ్లో ఓటింగ్ శాతం పెరిగింది. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో నబీల్ వర్సెస్ సోనియా టీమ్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఇక ఆ మరుసటి రోజు నబీల్ ఏకంగా 35 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచాడు. ఈ వారం మొత్తం అత్యధిక ఓటింగ్‌తో నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. శుక్రవారం రోజున ఓటింగ్ పూర్తికాగా.. ఇప్పటివరకు ఏ అన్ అఫీషియల్ పోల్ చూసినా.. న
డబుల్ ఎలిమినేషన్: అయితే మరికొన్ని రోజుల్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు హౌజ్‌లోకి రానున్న నేపథ్యంలో.. ఆ లోపు హౌజ్ నుంచి ముగ్గురు లేదా నలుగురిని బయటికి పంపాలని బిగ్‌బాస్ టీమ్ భావిస్తోందట.ఈ నేపథ్యంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్. ఇందులో భాగంగా సోనియా, ఆదిత్య ఓంను బయటకు పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ పెద్ద ప్లాన్ అమలు చేయనున్నట్లు సమాచారం. ఆదిత్య ఓం, సోనియాను ఎలిమినేట్ చేసి.. ఇందులో సోనియాను సీక్రెట్ రూమ్‌కు పంపనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే సోనియా ఉంటేనే కావాల్సినంత కంటెంట్, గొడవలు ఉండనున్నాయి. దీంతో ఆమెను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌కి పంపనున్నారని టాక్.