Latest Updates

BC రిజర్వేషన్ల కోసం సమష్టి పోరాటం: రాహుల్ గాంధీ ట్వీట్

బీసీ రిజర్వేషన్ల సాధనకు సిద్ధమయ్యే వచ్చాం.. కేంద్రంతో పోరాటమే: సీఎం రేవంత్

న్యాయసమాజ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన BC రిజర్వేషన్ల ధర్నాపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఈ పోరాటం కేవలం తెలంగాణకు పరిమితమయ్యేది కాదు. ఇది భారతదేశంలోని అన్ని అణగారిన వర్గాల పక్షాన జరుగుతున్న సమష్టి ఉద్యమం” అని రాహుల్ తెలిపారు.

బహుజన వర్గాలకు పాలనలో భాగస్వామ్యం ఇవ్వడమే ఈ ఉద్యమ ప్రధాన ఆదేశమని రాహుల్ వివరించారు. “ప్రతీ భారతీయుడికి అధికారంలో ప్రాతినిధ్యం కలగాలి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఇదే సామాజిక న్యాయం సూత్రం” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ఈ విషయాన్ని సమీక్షించి, BC రిజర్వేషన్లకు సంబంధించిన చట్టాన్ని ఆమోదిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

BC రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న ఈ ధర్నా సామాజిక న్యాయానికి నాంది పలికే ఉద్యమంగా భావించాల్సిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం న్యాయమైన దారిలో ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. బహుజన వర్గాల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి చట్టపరమైన కట్టుబాట్లు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version