News
BC రిజర్వేషన్లపై స్పష్టమైన ధీమా: బీజేపీ మెడలు వంచినా సాధిస్తాం – సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ఎంత తిరగబడ్డా BCలకు రిజర్వేషన్లు సాధించి తీరతామని స్పష్టం చేశారు. రైతులపై తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో మొదట మొండికేసిన బీజేపీని చివరకు మృదువుగా చేసి, క్షమాపణ చెప్పించగలిగామని గుర్తుచేశారు.
“బీజేపీకి తొలుత ససేమిరా అనడం, తరువాత పారిపోవడం సహజ లక్షణం. కానీ మేము ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని సాధించేవాళ్లం,” అని రేవంత్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.