Connect with us

Entertainment

బాలయ్యతోనే ఆటలా..? కరణ్ జోహర్‌కు మైండ్ పోయింది

నందమూరి బాలకృష్ణతో మాటామంతీ అంటే అవతలి వాళ్లకు దబిడి దిబిడే. ఆహా షోలో బాలయ్య ఎంత చలాకీగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. హోస్ట్ రూపంలో బాలయ్య అలా కూర్చుంటేనే అవతలి వాళ్లకి తడిసిపోతూ ఉంటుంది. అలాంటిది బాలయ్యనే ప్రశ్నలు అడగాలంటే.. వాటికి సమాధానాలు రాబట్టాలంటే మామూలు విషయం కాదు. కానీ కరణ్ జోహర్ ఆ సాహసం చేశాడు. గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఐఫా వేడుకలో ఈ ఘటన జరగింది.

దుబాయ్‌లో జరిగిన వేడుకలో చిరంజీవి, బాలయ్యలను సపరేట్‌గా సత్కరించారు. ఈ క్రమంలో బాలయ్యకు లెజెండరీ అవార్డును ఇచ్చారు. అయితే ఈ క్రమంలో కరణ్ జోహర్ అక్కడ ఓ షోను హోస్ట్ చేశారు. బాలయ్యను ఇరుకున పెట్టే ఓ ప్రశ్న అడిగాడు. మీ సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో ఏ హీరో అంటే మీకు ఇష్టం అని బాలయ్యను కరణ్ అడిగాడు. దీంతో బాలయ్య అదిరిపోయేలా కౌంటర్ వేశాడు.

మీకు సల్మాన్ ఖాన్ ఇష్టమా? ఆమిర్ ఖాన్ ఇష్టమా? షారుఖ్ ఖాన్ ఇష్టమా? అని అడగటంతో ఆడిటోరియం అంతా గొల్లున నవ్వేసింది. ఇక రానా సైతం సమంత మీద ఇలాంటి ఓ కామెంట్ చేశాడు. టాలీవుడ్ టు బాలీవుడ్.. బాలీవుడ్ టు హాలీవుడ్‌కు వెళ్లిపోయింది.. సిస్టర్ ఇన్ లా నుంచి సిస్టర్‌లా మారిపోయింది అంటూ సమంత మీద రానా సెటైర్ వేశాడు. ఆ కౌంటర్‌కు సమంత ఫక్కున నవ్వేసింది.

బాలయ్య ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ నాలుగో సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్ చేశారు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ టీంతో బాలయ్య పెట్టిన ముచ్చట్లకు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. మున్ముందు అల్లు అర్జున్ తన పుష్ప 2 కోసం బాలయ్య షోలో సందడి చేయబోతోన్నాడు. రామ్ చరణ్ కూడా రాబోతోన్నాడనే సమాచారం వచ్చేసింది. బన్నీ అయితే నంద్యాల అంశం గురించి కూడా అందులో క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు.

Loading