Connect with us

Andhra Pradesh

సినిమాలు ముఖ్యమా.. రాజకీయాలు ముఖ్యమా.. ఏది ముఖ్యమో చెప్పిన పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఫ్యాన్స్ అందు పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరయా అనే లెవల్లో వారి అభిమానం ఉంటుంది. ఇక సినిమాల్లో పవర్ స్టార్‌గా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పాలిటిక్స్‌లోనూ పవర్‌లోకి వచ్చారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా కీలకమైన మంత్రిత్వశాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందా అని.. ఆయన సినిమాల అప్ డేట్ ఏంటా అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాల గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసిన ఫ్యాన్స్ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయన నెక్ట్స్ మూవీ అయిన ఓజీని గుర్తుచేస్తూ.. ఓజీ, ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాల అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది.

అభిమానులు ఓజీ.. ఓజీ.. అంటూ ఉంటే చాలారోజులు అది తనకు మోదీ, మోదీ అని వినిపించిందని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాల కంటే ముందు బాధ్యత ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ముందు బాధ్యత.. ఆ తర్వాతే సినిమాలంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“నేను అందరూ హీరోలు బాగుండాలని కోరుకుంటాను. ఎవరితోనూ పోటీ పడను. ప్రతీ ఒక్కరికీ వారిదంటూ ఒక శైలి ఉంది. నాకు మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్ ఇతర ప్రతీ హీరో అన్నా కూడా ఇష్టమే, వారి సినిమాలు విజయం సాధించాలని, మీరు అనందపడాలని నేను కోరుకుంటా. కానీ మీరు ముందు సినిమాలు చూడాలంటే మీ దగ్గర డబ్బు ఉండాలి కదా, అది సృష్టించడం కోసం మేము పనిచేస్తున్నాం. అభిమానుల కోరిక ఏంటో కూడా నాకు బాగా తెలుసు, నాకు ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మీ సమస్యల పరిష్కారంతో పాటుగా మీ ఆనందం కూడా ముఖ్యమే, నేను మరింత బలంగా పనిచేయాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా ఆర్థికంగా నాకు సినిమాలు ఒక్కటే. తీరిక సమయంలో సినిమాలు చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తా” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Loading