Andhra Pradesh
APలో ప్రభుత్వ స్కూళ్లకు కీలక ఆదేశాలు: జూలై 12 వరకు స్పెషల్ డ్రైవ్
2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 12 వరకు స్పెషల్ డ్రైవ్‌ను కొనసాగించాలని, అందులో భాగంగా “బడిఈడు” పిల్లలను గుర్తించేలా ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించింది.
అదేవిధంగా విద్యార్థులకు అందించే పథకాల గురించి తల్లిదండ్రులకు సమగ్రమైన అవగాహన కల్పించాలని తెలిపింది. ఇప్పటికే బడి మానేసిన పిల్లలను గుర్తించి, మళ్లీ స్కూల్‌లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నది స్పష్టమైన దిశా నిర్దేశం. ఈ ఆదేశాలను ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పాటించేలా DEOలు మానిటరింగ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది