Andhra Pradesh
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఆన్లైన్లో సులభంగా బుక్ చేసుకోవచ్చు.

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఆన్లైన్లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఇలా ఉంటుంది:
తిరుమల దర్శనం టికెట్లు: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు దర్శనం టికెట్లు పొందడం కష్టంగా ఉంటుంది.రెండు మూడు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆన్లైన్ టీటీడీ దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం..
తిరుమల (TTD ఆలయం)కి వెళ్లే శ్రీవారి భక్తులకు దర్శనం టికెట్లు సులభంగా దొరకవు. ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లను ఒకటి లేదా రెండు నెలల ముందే బుక్ చేయాలి. ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే రోజంతా క్యూ లో ఉండాలి. మరి 300 రూపాయల దర్శనం టికెట్లు లేని వారు.. గంటల పాటు క్యూలైన్లో వెయిట్ చేయలేని ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఏదైనా ఒక టికెట్ ఉండాలి. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు లేకపోతే కనీసం SSD టోకెన్ ఉండాలి.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అక్టోబర్ 22న విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. https://ttdevasthanams.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తిరుమల రూ.300 దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు:
- మొదట టీటీడీ (Tirumala Venkateswara Temple) అధికారిక వెబ్సైట్ https://www.tirumala.org/ ఓపెన్ చేయాలి
- తర్వాత హోమ్ పేజీలోని ఆన్లైన్ బుకింగ్ ఎంపిక మీద క్లిక్ చేయాలి.
- ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్ అకౌంట్ ఉండాలి.
- ఒకవేళ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
- ఈ–మెయిల్ ID మరియు పాస్వర్డ్ని ఉపయోగించి హోమ్ పేజీలో నేరుగా లాగిన్ కావచ్చు.
- లాగిన్ అయిన తరువాత ఈ–ఎంట్రీ దర్శన్ ఎంపికను ఎంచుకోవాలి.
- తరువాత, ఎంత మంది దర్శనానికి వెళ్ళుతున్నారో ఆ సమాచారాన్ని నమోదు చేయాలి. అవసరమైతే అదనపు లడ్డూలను కూడా ఎంచుకోవచ్చు.
- తేదీని ఎంపిక చేసుకుని అందుబాటులో ఉన్న టైమ్ స్లాట్లను ఎంచుకోని ముందుకు కొనసాగడానికి ‘కంటిన్యూ‘ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు యాత్రికులుగా మీతో పాటు వచ్చే ఇతర వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి.
- చెల్లుబాటు అయ్యే ID లను నమోదు చేయాలి.
- ఇది పూర్తైన తర్వాత, పేమెంట్ ఎంపికపై క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా ఆన్లైన్లో డబ్బు చెల్లించాలి.
- పేమెంట్స్ విజయవంతమైన తర్వాత మీరు మీ టిక్కెట్లను PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.