Andhra Pradesh

ఏపీ ప్రజలకు మంచి వార్త.. నాలుగు నెలల తర్వాత పాపికొండలు విహారయాత్ర తిరిగి ప్రారంభం. 

ఏపీ ప్రజలకు మంచి వార్త.. నాలుగు నెలల తర్వాత పాపికొండలు విహారయాత్ర తిరిగి ప్రారంభం. 

పాపికొండల విహారయాత్ర ప్రారంభమైంది. గండిపోచమ్మ బోటు పాయింట్ నుంచి యాత్ర మొదలైంది.పర్యాటకులు బోటుల్లో విహారయాత్రకు బయల్దేరి వెళ్లారు. దాదాపు నాలుగు నెలల తర్వాత యాత్ర ప్రారంభమైంది. క్రమంలో శుక్రవారం మాక్డ్రిల్ నిర్వహించారు అధికారులు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో విహారయాత్రను ప్రారంభించారు అధికారులు. టికెట్ల విషయానికి వస్తే.. రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు రూ.1250 ఛార్జ్గా నిర్ణయించారు.. పిల్లలకు (పదేళ్ల లోపు) రూ.1000. 

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యగమనిక.. పాపికొండల విహారయాత్ర ప్రారంభమైంది. జులై 13 నుంచి గోదావరి వరదల కారణంగా పాపికొండల విహారయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే.. యాత్రకు తిరిగి ఇవాళ శ్రీకారం చుట్టారు. గండిపోచమ్మ బోటింగ్పాయింట్నుంచి యాత్రను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులతో మూడు బోట్లలో వెళ్లి శుక్రవారం రోజు మాక్డ్రిల్లో నిర్వహించి పరిశీలించానారు. గండిపోచమ్మ పాయింట్ నుంచి సర్ ఆర్థర్ కాటన్ పర్యాటక శాఖ బోటులో 40 మంది పర్యాటకులు, నలుగురు సిబ్బంది ప్రయాణించేందుకు ఉంటుంది. అలాగే, 14 ప్రైవేట్ బోట్లు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయి. 

పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు రాజమహేంద్రవరం ఏపీ పర్యాటక శాఖ కార్యాలయం నుంచి ఉదయం 7.30 గంటలకు వాహనంలో బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి గండిపోచమ్మ బోటు పాయింట్చేరుకుని, ఉదయం 9.30 గంటలకు యాత్ర మొదలై సాయంత్రం 5.30 గంటలకు మళ్లీ గండిపోచమ్మ పాయింట్కు తిరిగి వస్తారు. అక్కడి నుంచి వాహనంలో సాయంత్రం 7.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. 

పాపికొండల విహారయాత్రకు టికెట్ ధరలు ఇలా ఉన్నాయి: 

  • రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు రూ.1250, పిల్లలకు (పదేళ్లలోపు) రూ.1000. 
  • గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.1000, పిల్లలకు (పదేళ్లలోపు) రూ.750. 

 మరిన్ని వివరాలకు 9848629341కు సంప్రదించాలని సూచించారు. మరోవైపు పాపికొండలు యాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులు www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, రాజమహేంద్రవరం నుంచి ప్రైవేట్ బోట్ ట్రిప్లు అందుబాటులో ఉంటాయి. పాపికొండల విహారయాత్రలో పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలను చూడవచ్చు. పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే విహార యాత్ర కోసం నిత్యం వందలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version