Andhra Pradesh

ఏపీ మీదుగా అయోధ్యకు ప్రత్యేక రైలు.. ఈ రూట్‌లోనే, ఆగే స్టేషన్‌లు ఇవే

ఏపీ మీదుగా అయోధ్యకు ప్రత్యేక రైలు.. ఈ రూట్‌లోనే, ఆగే స్టేషన్‌లు ఇవే

విజయవాడ నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపాలని ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లే యాత్రికుల కోసం భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ఈనెల 11న ప్రారంభమవుతుంది. ఈ రైలు విజయవాడ మీదుగా అయోధ్య మరియు కాశీకి వెళ్లుతుంది. అక్కడ దర్శనీయ ప్రాంతాలను చూడొచ్చు. ఈ మేరకు అధికారులు ఛార్జీల వివరాలను కూడా వెల్లడించారు. ఈ భారత్ గౌరవ్ రైలు గురించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. అయోధ్య, కాశీ తదితర పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ టూర్ ప్యాకేజీలో 9 రాత్రులు, 10 రోజులు ఉంటాయి. ఈ భారత్ గౌరవ్ రైలు డిసెంబరు 11న సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది.. పుణ్యక్షేత్రాల దర్శనం తర్వాత 20న తిరుగు ప్రయాణమవుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్‌లలో ఆగుతుంది.. సికింద్రాబాద్‌లో ఈ రైలు ప్రారంభమై.. కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం (పెందుర్తి), విజయనగరం రైల్వే స్టేషన్‌ల మీదుగా ఒడిశాకు వెళుతుంది. అక్కడి నుంచి పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమవుతుంది.

ఈ రైలు ప్యాకేజీలో.. విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని మీదుగా పూరిలోని జగన్నాథ ఆలయం, గయలో విష్ణుపాద ఆలయం, కాశీ విశాలాక్షి, వారణాశిలో కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణాదేవి, సాయంత్రం గంగా హారతి ఉంంది. అయోధ్యలో సరయు నది దగ్గర రామజన్మభూమి, హనుమాన్ గర్హి, ప్రయోగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో టీ, టిఫిన్, భోజనం, రవాణా, ప్రమాద బీమా మరియు పన్నులతో సహా టికెట్ ధర స్లీపర్ క్లాస్‌లో రూ.16,800, థర్డ్ ఏసీలో రూ.26,650, సెకండ ఏసీలో రూ.34,910 ఉంటుంది. ఈ టూర్‌కు వెళ్లడానికి టికెట్ల బుకింగ్ మరియు ఇతర వివరాలకు 9281495848, 8977314121 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

మరోవైపు రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడిచే 10 రైళ్ల నంబర్లను మార్చారు. ఈ నిర్ణయం సాధారణ నిర్వహణ కారణంగా తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. మార్చి 1 నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని తెలిపారు.

  • విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488/17487) కి కొత్త నంబర్లు 18521/18522 ఇచ్చారు.
  • విశాఖపట్నం-గుంటూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్ (22701/22702) రైళ్లకు కొత్త నంబర్లు 22875/22876 ఇచ్చారు.
  • భువనేశ్వర్-రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (20896/20895) కి కొత్త నంబర్లు 20895/20896 ఇచ్చారు.
  • భువనేశ్వర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (12898/12897)కి కొత్త నంబర్లు 12897/12898 ఇచ్చారు.
  • భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12830/12829) కి కొత్త నంబర్లు 12829/12830 ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version