Andhra Pradesh
“రఘురామకృష్ణరాజు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సంచలనాలు సృష్టించాలని చంద్రబాబు తేలిపరు.”

“రఘురామకృష్ణరాజు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సంచలనాలు సృష్టించాలని చంద్రబాబు తేలిపరు.”
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో, రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే ప్రాచుర్యం పొందిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, సీఎం చంద్రబాబు రఘురామను హృదయపూర్వకంగా అభినందించారు. తెలుగుదనానికి ప్రతీకగా పంచెకట్టులో అసెంబ్లీకి వచ్చిన రఘురామ, స్పీకర్ పదవికి గౌరవాన్ని తీసుకువచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. కొత్త బాధ్యతలలో రఘురామ చూపిన ఉత్సాహం అందరికి సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు చెప్పారు.
ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్టు—మూడూ చేశారు. శుక్రవారం అరెస్టు చేయడం ద్వారా కోర్టు ఉండదు కాబట్టి ఆ పరిస్థితిని ఉపయోగించుకొని, జైల్లో ఉంచేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీలో రఘురామపై జరిగిన హింస దారుణంగా నిలిచింది. లారీ రబ్బర్ బెల్టులతో ఆయన అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. కోర్టులో దీనిని వెల్లడిస్తే చంపేస్తామని ఆయనను బెదిరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయాలని సూచించినప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నివేదికలను వక్రీకరించడానికి ప్రయత్నించారు. వైద్య పరీక్షల నివేదికను కోర్టుకు సమర్పించడంలో ఆలస్యం చేశారు. కోర్టు రఘురామను హాజరుపరచాలని ఆదేశించినప్పటికీ, తీసుకురాకుండా నిరాకరించారు. చివరికి, హైదరాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆ సమయంలో ముఖ్యమంత్రి రఘురామకృష్ణరాజును పోలీసుల చేత కొట్టించి, ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చూస్తూ పైశాచిక సంతోషం పొందారు. ఎంపీగా రఘురామ తన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గానికి రావడం ఆపించారనుకున్నారు కానీ, రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగా చేరుకున్నారు. పోరాట యోధుడిగా విజయాన్ని సాధించిన రఘురామను అభినందిస్తున్నాను. ఆ రోజుల్లో రాష్ట్రానికి రానీయని వాళ్ళే నేడు మీ ముందే సభలోకి రావడానికీ, కూర్చోవడానికీ సాహసించలేకపోతున్నారు. “ఇది ఆ దేవుడే రాసిన స్క్రిప్ట్” అని చంద్రబాబు అన్నారు. ఆరునెలల క్రితం మీమాల్ని సభలో అడుగు పెట్టనివ్వమని చెప్పినవారే ఈ రోజు సభలో అడుగు పెట్టలేకపోయారు డిప్యూటీ సీఎం పవన్
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అడుగు పెట్టడాన్ని ఆపుతామన్నవారే ఈ రోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారు. కర్మఅంత బలంగా ఉంటుంది,” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని పవన్ అభినందిస్తూ, ఆయన పోరాట పటిమను ప్రశంసించారు. “ఉండి నియోజకవర్గం నుండి 56,000కు పైగా ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీలో ప్రవేశించారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేర స్థాయికి తీసుకెళ్లింది. నేరస్థులు అధికారంలోకి రాగానే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనం ఇటీవల చూశాం. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయాల్లో నేరస్థులకు స్థానం ఉండరాదు, అయితే దురదృష్టవశాత్తూ 2019లో నేరస్థులు అధికారంలోకి వచ్చారు,” అని పవన్ కల్యాణ్ అన్నారు.