Andhra Pradesh

ఏపీలో లిక్కర్ రేట్లు ఫిక్స్ అయ్యాయి.. కొత్త బ్రాండ్‌లు, వాటి ధరలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.. లాటరీలో కేటాయించిన షాపుల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గతంలో ఉన్న షాపుల్లోనే అమ్మకాలు జరుపుతుండగా.. చాలా చోట్ల లైసెన్స్‌దారులు షాపుల్ని చూసుకునే పనిలో పడ్డారు. కొంతమందికి ఇప్పటికిప్పుడు అద్దెకు షాపులు దొరకలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కాలేజీలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో ఉండకూడదు. అయితే డిపోల నుంచి మద్యం స్టాక్‌ను షాపులకు చేర్చేసారు.

ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రకారం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఈరోజు నుంచి అమలయ్యే కొత్త మద్యం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ విస్కీ క్వార్టర్ రూ.230, Mc Dowels No1 విస్కీ క్వార్టర్ రూ.180, 8 PM విస్కీ క్వార్టర్ రూ.230, ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ క్వార్టర్ రూ.150.. బ్రాండ్‌ను బట్టి విస్కీ క్వార్టర్ ధర రూ.150 నుంచి రూ.230 మధ్య ఉంది. ఇక బ్రాందీ విషయానికి వస్తే.. Mansion House క్వార్టర్ రూ.240, వోడ్కా మ్యాజిక్ మూమెంట్స్ క్వార్టర్ రూ.230, ఓల్డ్ మంక్ రమ్ము క్వార్టర్ రూ. 230. అలానే బీర్ల విషయానికి వస్తే.. కింగ్ ఫిషర్ Splendid స్ట్రాంగ్ బీర్ రూ. 200, కింగ్ ఫిషర్ స్ట్రోమ్ రీగల్ స్ట్రాంగ్ బీర్ రూ.220.. ఇలా ధరలు ఉన్నాయి. కేటగిరీల వారీగా బ్రాందీ, విస్కీ, వోడ్కా, బీర్లు, బ్రీజర్ల ధరలు కింద PDF లిస్ట్‌లో మీరు చూడొచ్చు.

PDF File: 114273288

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకున్న వారు.. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్సు రుసుములో ఆరో వంతు మొత్తాన్ని చెల్లించాలి. షాపులు దక్కించుకున్నవారు ఈ మొత్తాన్ని చెల్లించడంతో తాత్కాలిక లైసెన్స్‌ జారీ చేశారు.. ఈనెల 22వ తేదీ వరకు ఈ లైసెన్స్ అమలులో ఉంటుంది. అయితే కొత్తగా షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు అమలులో ఉంటేనే పూర్తిస్థాయి లైసెన్స్‌ అందజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version