Connect with us

International

AIతో భయం వద్దు, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి!

Artificial Intelligence (AI) - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on Artificial Intelligence (AI) | Sakshi

ప్రస్తుతం AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఉద్యోగాలు పోతున్నాయని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ భయం తాత్కాలికమైనదని, నిరంతరం నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చని AI సైంటిస్ట్ శ్రీకాంత్ వర్మ తెలిపారు.

AI ఒక సవాలుగా కనిపించినా, నిరంతర అభ్యాసం, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కీలక నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్‌లో విజయం సాధించవచ్చని ఆయన సూచించారు.

పిల్లలకు చిన్న వయస్సు నుంచే ఈ నైపుణ్యాలను నేర్పించడం వారిని AI ఆధారిత ప్రపంచానికి సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు.

AI గురించి భయపడకుండా దాన్ని సవాలుగా స్వీకరించాలని బీటెక్ విద్యార్థులకు శ్రీకాంత్ వర్మ సలహా ఇచ్చారు. AI సంబంధిత కోర్సులను చేరి, ఆ రంగంలో నైపుణ్యం సాధించడం ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చని తెలిపారు.

“AI ఒక టూల్ మాత్రమే, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించే వారు ఎప్పుడూ డిమాండ్‌లో ఉంటారు,” అని ఆయన స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలతో AI యుగంలో సవాళ్లను అవకాశాలుగా మలచుకోవచ్చని ఆయన నొక్కి చెప్పారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *