Fashion
అనంత్, రాధిక పెళ్ళిలోగ్రాండ్ లుక్‌లో ఐశ్వర్య..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ మ్యారేజ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకి సెలబ్రిటీలంతా అటెండ్ అయ్యారు. ఇందులో ఐశ్వర్యరాయ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా హాజరై నూతన వధువరూలని ఆశీర్వదించారు. అయితే, ఈ నేపథ్యంలోనే మాజీ ప్రపంచసుందరి కూడా వచ్చింది.
ఐశ్వర్య లుక్ ఈ మ్యారేజ్‌లో హైలైట్ అయింది. రెడ్ కలర్ అనార్కలీ సెట్‌లో ఈమె అటు ట్రెడీషనల్‌గా ఇటు మోడ్రన్‌లుక్‌లో కనిపించింది.
తన డ్రెస్ డీటెయిల్స్‌కి వస్తే మంచి రెడ్ నెక్ జాకెట్ అనార్కలీ డ్రెస్. ఇది గోల్డెన్ బార్డర్‌తో ఉన్న డ్రెస్. దీంతో మంచి ట్రెడిషనల్ లుక్ సొంతమైంది.
తన కూతురు ఆరాధ్య కూడా మంచిది పిస్తా గ్రీన్ అనార్కలీ డ్రెస్‌లో మెరిసిపోయింది.
ఐశ్వర్య వేసుకున్న డబుల్ లేయర్డ్ అనార్కలీకి మంచి దుపట్టా లుక్‌ని ఎలివేట్ చేయగా.. దీనికి మ్యాచింగ్‌గా తను మంచి నెక్లెస్, ఝుంకీలు, మాంగ్ టిక్కాతో పాటు..బ్రైట్ మేకప్‌తో అదరగొట్టింది.