Andhra Pradesh
AI సాయంతో 2-3గంటల్లో శ్రీవారి దర్శనం: BR నాయుడు
AP: తిరుమలలో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని టిటిడి ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. టిటిడి లో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిని మరో విభాగాలకు మార్చడంపై, వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంపై చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ‘AI సాయంతో 2-3గంటల్లో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా చేస్తున్నాం. ఉదయం టికెట్ బుక్ చేసుకుంటే, అదే రోజు సాయంత్రానికి దర్శనం అయ్యేలా సదుపాయాలు కల్పిస్తాం. గతంలో VIP దర్శనాలు ఉదయం 10 గంటలకు ఉండటంతో సాధారణ భక్తులు ఇబ్బందులు పడేవారు. ఇకపై వాటిని ఉదయం 8-8.30 గంటలకే ముగించేలా చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.