Entertainment

Actor Govinda: స్టార్ హీరో ఇంట్లో కాల్పులు.. ఒంట్లోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ఆసుపత్రిలో నటుడు గోవింద..

మంగళవారం తెల్లవారుజామున నటుడి ఇంట్లో గన్ మిస్ ఫైర్ జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో హీరో గోవింద కాలులోకి బుల్లెట్స్ దూసుకెళ్లాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతడిని ముంబైలోని CRITI ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ఇంట్లో అనుహ్యం ఘటన చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున నటుడి ఇంట్లో గన్ మిస్ ఫైర్ జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో హీరో గోవింద కాలులోకి బుల్లెట్స్ దూసుకెళ్లాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతడిని ముంబైలోని CRITI ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ

ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోవింద తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నటుడు గోవిందకు పర్సనల్ రివాల్వర్ ఉంది.. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు పని నిమిత్తం బయటకు వెళ్తుండగా అనుహ్యంగా గన్ మిస్ ఫైర్ జరిగినట్లు సమాచారం. రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో నటుడి మోకాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం గురించి గోవింద కుటుంబసభ్యుల నుంచి, ఇటు పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ ఘటనపై గోవింద మేనేజర్ శశి సిన్హా మాట్లాడుతూ.. “ఉదయం గోవింద కోల్ కత్తా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తన లైసెన్స్ రివాల్వర్ ను పట్టుకున్నాడు. అదే సమయంలో రివాల్వర్ అనుకోకుండా అతడి చేతిలో నుంచి జారిపడి పేలింది. దీంతో బుల్లెట్ గోవింద కాలులోకి వెళ్లింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించాము. వైద్యులు కాలు నుంచి బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నారు” అని చెప్పాడు. ఈ ఏడాది మార్చిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో గోవింద శివసేనలో చేరారు. కొన్ని నెలల క్రితం ప్రధానిని కలిశారు. ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గోవింద చివరిసారిగా మార్చిలో

‘డ్యాన్స్ దీవానే’ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా కనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version