Connect with us

Business

Aadhaar Mobile Number & Details Update: ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సులభంగా.. UIDAI ట్వీట్

భారతీయుల కోసం అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా ఆధార్ కార్డు నిలుస్తుంది.

భారతీయుల కోసం ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రం. ఆధార్ కార్డు గుర్తింపు కార్డు మాత్రమే కాదు. ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాలు తెరవడానికి, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి, రేషన్, పెన్షన్, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి అవసరం. అందుకే ఆధార్‌లో ఉన్న అన్ని వివరాలు ఎప్పుడూ తాజాగా, తప్పుల్లేకుండా ఉండేలా చూడటం ప్రతి పౌరుని బాధ్యత.

ముఖ్యంగా, ఆధార్‌లో పేరు, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. వీటిలో ముఖ్యమైన అంశం మొబైల్ నంబర్. ఎందుకంటే ఆధార్ ఆధారంగా ప్రభుత్వ పథకాల కోసం వెరిఫికేషన్ చేస్తారు. మొబైల్ నంబర్ మారితే ఆధార్‌లో కూడా అది అప్డేట్ చేయడం తప్పనిసరి.

కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో మీ మొబైల్ ఫోన్ నంబరును ఎప్పుడైనా మరియు మీరు ఉన్న చోటి నుండి సులభంగా అప్‌డేట్ చేయవచ్చు. ఈ కొత్త సౌకర్యం జనవరి 28 నుండి కొత్త ఆధార్ యాప్‌లో ప్రారంభమవుతుందని కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ట్విట్టర్‌లో ప్రకటించింది.

మునుపు విధానంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల చుట్టూ తిరిగి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటే, కొత్త సౌకర్యంతో మీరు ఇవ్వలి సౌకర్యాన్ని ఇంట్లో కూర్చుని పొందవచ్చు. UIDAI సూచన మేరకు, సదుపాయం పొందడానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొత్త ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మార్పు ప్రజలపై భారం తగ్గిస్తూ ఆధార్ వివరాల యాజమాన్యాన్ని మరింత సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.

#AadhaarUpdate#UIDAI#MobileNumberUpdate#AadhaarCard#DigitalIndia#GovtServices#AadhaarApp#EasyUpdate
#IdentityVerification#CitizenServices#AadhaarNews#IndianGovernment

Loading